అంతర్జాతీయం

పరస్పర సహకారానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాష్కెంట్, జూన్ 24: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్షను భారత్, రష్యాలు వ్యక్తం చేశాయి. పౌర అణు ఇంధన ఒప్పందం, హైడ్రోకార్బన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని శుక్రవారం ఇక్కడ సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను సంకల్పించారు.
ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక ద్వైపాక్షిక అనుబంధాన్ని ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకోవల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. షాంగై శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా పుతిన్, మోదీలు సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు రెండు దేశాలకు సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చా యి. పౌర అణు ఇంధనంలో సహకారం, గ్యాస్, పెట్రోకెమికల్స్ రంగంలో భాగస్వామ్యం తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించారని అలాగే వాణిజ్యం పెట్టుబడులు తదితర అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఎస్‌సిఓకు సంబంధించి అవగాహన ప్రతంపై భారత్ సంతకం చేయడాన్ని పుతిన్ హర్షించినట్టు ఆయన తెలిపారు. ఈ సంతకంతో షాంగై సహకార సంస్థలో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం లభిస్తుంది.
ఈ సభ్యత్వ అంశాన్ని పూర్తిచేయడానికి ఈ ఏడాది కాలంలో ఏకంగా 30 ఒప్పందాలు భారత్ కుదుర్చుకోల్సి వచ్చింది. భారత్ తమకు అత్యంత కీలకమైన మిత్రదేశమని, రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా తిరుగులేని మైత్రి బంధం కొనసాగుతుందని ఈ సందర్భంగా పుతిన్ వ్యాఖ్యానించినట్టు స్వరూప్ పేర్కొన్నారు.
తాష్కెంట్‌లో శుక్రవారం రష్యా అధ్యక్షుడు
పుతిన్‌తో భేటీ అయన ప్రధాని నరేంద్ర మోదీ