అంతర్జాతీయం

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 9: అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదం బలోపేతం కావడంతోపాటు దాని పరిధి కూడా విస్తరించిందని భారత్ బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద శక్తులకు ఏ రూపంలోనూ, ఏ పేరుతోనూ, ఏ దేశంలోనూ ఆశ్రయం లభించకుండా చూడాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అఫ్గానిస్తాన్‌పై మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ‘హార్ట్ ఆఫ్ ఆసియా’లో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్ సమైక్యత, భద్రతను కాపాడడానికి అంతర్జాతీయ సమాజం నిరంతరాయంగా మద్దతును కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. అఫ్గానిస్తాన్ తన రక్షణ సామర్థ్యాన్ని మెరుగు పరచుకునేందుకు భారత్ తన వంతు పాత్రగా ఆ దేశ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకొని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ఉగ్రవాదులు ఐక్యంగా ప్రయత్నించారని పేర్కొంటూ వారు ఇప్పటికీ మారలేదని గుర్తుచేశారు. ‘ఉగ్రవాద, తీవ్రవాద శక్తులు ఏ రూపంలోనూ, ఏ పేరుతోనూ ఆశ్రయం పొందకుండా చూడాల్సిన ఉమ్మడి బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ విషయంలో అఫ్గానిస్తాన్‌కు సమీపంలో ఉన్న దేశంగా మాపై ప్రత్యేక బాధ్యత ఉంది’ అని సుష్మా స్వరాజ్ అన్నారు. ఉగ్రవాద శక్తులను వీరోచితంగా ఎదుర్కొంటున్న అఫ్గాన్ భద్రతా బలగాలను, దేశ ప్రజలను ఆమె ప్రశంసించారు. ‘ఉగ్రవాద, తీవ్రవాద శక్తులను ఎంతో వీరోచితంగా ఎదుర్కొంటున్న అఫ్గాన్ జాతీయ భద్రతా బలగాలకు, అఫ్గాన్ ప్రజలకు మేము సెల్యూట్ చేస్తున్నాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘గత కొన్ని నెలల్లో అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదం బలపడటంతోపాటు వ్యాప్తి చెందింది’ అని ఆమె పేర్కొన్నారు. ‘అఫ్గానిస్తాన్‌లో శాంతిని నెలకొల్పడానికి ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలించడం, అంతర్జాతీయంగా ఆమోదం పొందిన నిబంధనలకు కట్టుబడి ఉండటం తప్పనిసరి’ అని అన్నారు.
అఫ్గాన్ అధ్యక్షుడితో సుష్మ భేటీ
అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో సుష్మా స్వరాజ్ బుధవారం ఇక్కడ భేటీ అయ్యారు. అఫ్గానిస్తాన్‌కు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు, దేశంలో శాంతి, సామరస్య పరిస్థితులను తిరిగి నెలకొల్పడం గురించి ఈ ఇద్దరు నేతలు చర్చించారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలోని భారత దౌత్యవేత్తలు ఆమెతో పాటు చర్చల్లో పాల్గొన్నారు. ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఈ ఇద్దరు నేతలు విడిగా సుమారు అరగంట సేపు చర్చలు జరిపారు. అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ అగ్రీమెంట్‌లో చేరడానికి భారత్ సంసిద్ధత అంశం కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. కిర్‌గిజ్‌స్తాన్ విదేశాంగ మంత్రి ఎర్లాన్ అబ్డిల్‌డేవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరిఫ్‌తో కూడా సుష్మా స్వరాజ్ విడివిడిగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.

ఇస్లామాబాద్‌లో బుధవారం పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ను కలుసుకున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్