అంతర్జాతీయం

భారత రాజ్యసభకూ మనకూ తేడా ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 26: అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్ సభ్యులు అనూహ్యంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయటాన్ని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు మార్క్ మీడోస్ తీవ్రంగా తప్పు పట్టారు. భారతదేశంలో రాజ్యసభలో అన్నాడిఎంకె సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలపడానికి మనకూ తేడా లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. మిగతా దేశాల్లో ఈ రకంగా ప్రవర్తించవచ్చేమో కానీ, అమెరికాలో ఇలా ప్రవర్తించటం సరి కాదని ఆయన అన్నారు. ఉత్తర కరోలినా నుంచి రెండు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన మీడోస్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యానాలు చేయటమే కాకుండా భారత రాజ్యసభలో అన్నా డిఎంకె సభ్యుల నిరసనలు, అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు చేసిన నిరసనల ఫోటోలను పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యానికి అమెరికా ప్రతి రూపమని ఆయన అన్నారు.