అంతర్జాతీయం

కామెరాన్ వారసుడు జాన్సన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 28:ఐరోపా యూనియన్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ప్రధాని కామెరాన్ స్థానే ఎవరికి బ్రిటీష్ సారథ్యం అప్పగించాలన్న దానిపై తీవ్రస్థాయిలోనే అధికార కన్సర్వేటివ్ పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బ్రిటీష్ ప్రధాని పదవికి గట్టిగా పోటీ పడుతున్న వారిలో లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ బుధవారం మొదలై గురువారమే ముగుస్తుంది. సెప్టెంబర్ 9న పార్టీ కొత్త నాయకుడ్ని ప్రకటిస్తామని కన్సర్వేటివ్ నాయకత్వం ప్రకటించడంతో కామెరాన్ వారసుడి ఎంపిక ప్రక్రియ ముమ్మరమైంది. 52 సంవత్సరాల జాన్సన్ బ్రెగ్జిట్ శిబిరానికి నేతృత్వం వహించారు. ఈ విషయంలో తన గురువు కామెరూన్‌కు వ్యతిరేకంగానే తీవ్రస్థాయిలో ప్రచారమూ సాగించారు. ఆ విధంగా బ్రిటన్ మెజార్టీ ప్రజల ఆదరణను చూరగొన్నారు. కాగా, ప్రధాని పదవికి పోటీపడుతున్న ఇతరుల్లో సుదీర్ఘ కాలంగా హోం మంత్రిగా కొనసాగుతున్న థెరీసా మే, యుకె ఆరోగ్య మంత్రి జెరెమి హంట్ కూడా ఉన్నారు. జాన్సన్ పేరు గట్టిగానే వినిపిస్తున్నా తాజాగా జరిగిన సర్వేలో మాత్రం అంతిమంగా ప్రధాని పదవి ధెనీసా మేను వరించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.