అంతర్జాతీయం

ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టుపై ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, జూన్ 29: టర్కీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 41 మంది మృతి చెందారు. 239 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది విదేశీయులని నగర గవర్నర్ వెల్లడించారు. వరుసగా మూడు ఆత్మాహుతి బాంబు పేలుళ్లు సంభవించినట్టు టర్కీ అధికారి ఒకరు తెలిపారు. ఐదుగురు సౌదీ అరేబియా పౌరులు, ఇద్దరు ఇరాక్ పౌరులు, టునీషియా, ఉజ్‌బెకిస్తాన్, చైనా, ఇరాన్, ఉక్రెయిన్, జోర్డాన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు పేలుళ్లలో మరణించారు. ఐఎస్ జిహాదీలే దాడి చేసి ఉంటారని టర్కీ ప్రభుత్వం అనుమానిస్తోంది. తాజా దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఇస్తాంబుల్‌లోని టూరిస్ట్ ప్రాంతం ఇస్టికలల్ స్ట్రీట్‌లో జరిగిన మరో దాడిలో ముగ్గురు ఇజ్రాయేలీయులు, ఒక ఇరాన్ పౌరుడు మృతి చెందాడు. మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగిందని టర్కీ ప్రధాని బినాలీ యెల్డిరిమ్ తెలిపారు. దాడి నేపథ్యంలో ఇస్తాంబుల్ విమానాశ్రయాన్ని సీజ్ చేశారు. అన్ని విమాన సర్వీసులు రద్దు చేసినట్టు టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ బొజ్డాగ్ చెప్పారు. విమానాశ్రయానికి ఓ టాక్సీలో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యులు ఆటోమెటిక్ రైఫిల్స్‌తో ప్రయాణికులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్టు న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు. తరువాత ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నారని అన్నారు. దాడికి సంబంధించి సిసి కెమెరాల్లో దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దాడిని అమెరికా సహా పలుదేశాలు ఖండించాయి.
భారత్ ఖండన
ఢిల్లీ: ఇస్తాంబుల్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. మరణించిన లేక గాయపడ్డవారిలో భారతీయులెవరూ లేరని స్పష్టం చేసింది. భారత్ కాన్సులేట్ టర్కీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
షాక్‌కు గురైన హృతిక్
ఇద్దరు కుమారులతో కలిసి ఆఫ్రికా విదేశీ పర్యటనకు వెళ్లిన హృతిక్ ఇస్తాంబుల్ మీదుగానే భారత్‌కు తిరిగి వచ్చారు. అయతే వారికి కనెక్టింగ్ విమానం ఇస్తాంబుల్‌లో మిస్ అయనప్పటికీ, అక్కడ ఆగకుండా మరో విమానంలో భారత్‌కు తిరిగి వచ్చేశారు. ముంబయిలో దిగిన తరువాత ఇస్తాంబుల్ దాడి ఘటన తెలుసుకున్న హృతిక్ షాక్‌కు గురయ్యారు.