అంతర్జాతీయం

సౌదీలో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, జూలై 4: సౌదీ అరేబియా పట్టణాలైన మదీనా, ఖాటిఫ్, జెద్దాలు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి. రంజాన్ ఉపవాస నెల చివరి రోజున ఈ దాడులు జరగటం తీవ్రస్థాయిలో ఆందోళనకు దారితీసింది. ఈ సంఘటనల్లో పలువురు మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో ఆయా మసీదుల వద్ద హాహాకారాలు మిన్నంటాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయని సాక్ష్యులు తెలిపారు. మొత్తం మూడు విస్ఫోటనాల శబ్దాలు తమకు వినిపించినట్లుగా వెల్లడించారు. మొదట్లో ఒక ప్రమాద కారణంగానే ఇది జరిగిందని భావించినప్పటికీ, అనంతరం ఆత్మాహుతి బాంబర్ దాడిగా అధికారులు ధ్రువీకరించారు. మృతుల సంఖ్యపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. ఆత్మాహుతి దళాలే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి స్పష్టమవుతోంది. ఖాటిఫ్‌లో జరిగిన దాడిలో ఆత్మాహుతి బాంబర్‌ను తాను స్వయంగా చూసినట్లుగా ఓ సాక్షి వెల్లడించాడు. మసీదు సమీపంలో తన కళ్లముందే ఆ బాంబర్ పేలిపోయినట్లుగా పోలీసులకు తెలిపాడు. అమెరికా కాన్సులేట్ సమీపంలో సోమవారం పేలుడు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వరుస ఆత్మాహుతి దాడులు జరగటం గమనార్హం. అయితే ఈ బాంబర్ సౌదీ కాదని, సౌదీలో ఉంటున్న ఓ విదేశీయుడేనని దేశీయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మన్సూర్ అల్ టుర్కీ తెలిపారు.