అంతర్జాతీయం

మరిన్ని దాడులు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 6: ప్రపంచ వ్యాప్తంగా షరియా చట్టాన్ని అమలుచేసే వరకూ దాడులు జరుపుతూనే ఉంటామని, బంగ్లాదేశ్‌లో ఇటీవల తాము జరిపిన ఊచకోత నమూనా మాత్రమేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. బంగ్లాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంతకుమించిన తీవ్రతతోనే భయానక దాడులు జరుపుతామని ఓ వీడియో సందేశంలో పేర్కొంది. గత వారం జరిగిన ఊచకోత ఘటన నుంచి బంగ్లాదేశ్ ఇంకా తేరుకోకుండానే మళ్లీ దాడులు జరుపుతామంటూ ఐసిస్ హెచ్చరించడం కలకలం రేపుతోంది. సిరియాలోని రక్కా ప్రాంతంనుంచి ఈ వీడియో సందేశం జారీ అయినట్టుగా తెలుస్తోంది. పైగా ఇది బంగ్లా భాషలో ఉండడం, ఈ ప్రాంతంలోనూ ఐసిస్ వేళ్లూనుకుంటుందన్న వాదనకు అద్దం పడుతోంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున యూట్యూబ్ ద్వారా వీడియోను విడుదల చేశారు. సామాజిక మీడియాలో ఈ వీడియో హెచ్చరికకు విస్తృతమైన ప్రచారం లభించింది. ‘ఇటీవల ఢాకాలో జరిపిన దాడి ఓ నమూనా మాత్రమే. ఇంకా చాలా తీవ్రస్థాయిలోనే దాడులకు సమాయత్తం అవుతున్నాం’ అని తెలిపింది. ఈ వీడియో కనిపించిన ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. మరొక ఇద్దరు గడ్డంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ వీడియోలో కనిపించిన ముగ్గురూ బంగ్లాదేశీయులే అయినప్పటికీ వారికి గుర్తించడానికి ఎలాంటి ఆస్కారం లేకపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా షరియా చట్టం అమలు చేసే వరకూ ఈ తరహా దాడులు జరుగుతూనే ఉంటాయని ఈ ముగ్గురిలో ఒకడు హెచ్చరించారు. ఈ పోరాటంలో విజయమే ధ్యేయంగా ప్రాణాలు కోల్పోడానికి తాము సిద్ధమేనని తెలిపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, ఇది ఏమాత్రం క్షమార్హం కాని నేరమని పేర్కొన్నాడు.