అంతర్జాతీయం

ఇరాక్‌పై యుద్ధం ‘తప్పు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 6: తప్పుడు నిఘా సమాచారం ఆధారంగానే అప్పట్లో అమెరికాతో కలిసి బ్రిటన్ ఇరాక్‌పై యుద్ధం చేసిందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. అప్పటి బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లేయర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ దర్యాప్తు నివేదిక ఎన్నో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.శాంతియుతంగా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా తప్పుడు నిఘా సమాచారం ఆధారంగానే ఇరాక్‌పై యుద్ధ్భేరీ మోగించాలని అప్పటి బ్లేయర్ ప్రభుత్వం నిర్ణయించిందని జాన్ చిల్‌కాట్ అధ్యక్షతన పనిచేసిన దర్యాప్తు సంఘం తన నివేదికలో తెలిపింది. ఇరాక్ నిరాయిధీకరణకు సంబంధించి ఉన్న అవకాశాలను బ్రిటన్ విస్మరించిందని, అమెరికాతో చేతులు కలిపి యుద్ధానికి దిగిందని పేర్కొంది. అప్పట్లో ఇరాక్‌పై సైనిక చర్యకు దిగాల్సిన అవసరం లేకపోయినా అందుకే మొగ్గుచూపారని జాన్ చిల్‌కాట్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే మానవాళి విధ్వంసక ఆయుధాలు ఉన్నాయన్న కథనాల్లో ఎలాంటి విశ్వసనీయత లేదని కూడా ఆయన తెలిపారు. మొత్తం 12 సంపుటాలు, 2.6 మిలియన్ పదాలు కలిగిన నివేదిక కాపీని ఆయన ప్రభుత్వానికి అందించారు. 2009న ఏర్పాటైన ఈ కమిషన్ ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాత్ర సహేతుకను అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది. 2003 నుంచి 2009 మధ్యకాలంలో ఇరాక్ యుద్ధంలో 180 మంది బ్రిటన్ సైనికులు మరణించారని ఆయన అన్నారు.