అంతర్జాతీయం

ఉగ్రవాదం ఉమ్మడి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిటోరియా, జూలై 8: ఉగ్రవాదంతో అందరికీ ముప్పేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇది ఉమ్మడి సమస్య కాబట్టి కలసికట్టుగానే దీన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో సంయుక్తంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మోదీ ‘ఉమ్మడి సవాలుగా మారిన ఉగ్రవాదంతో రెండు దేశాల ప్రజల భద్రతకు ప్రమాదమే’నని తెలిపారు.
ప్రాంతీయంగానైనా, అంతర్జాతీయంగానైనా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సంయుక్త ప్రయత్నం ఎంతో అవసరమని, అలాగే నిరంతరం అప్రమత్తంగా ఉండటం ద్వారానే దీన్ని రూపుమాపగలుగుతామని ఉద్ఘాటించారు. ముఖ్యంగా భారత్-దక్షిణాఫ్రికాలు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సంయుక్త పోరాటం, పరస్పర సహకారంతో ఉగ్రవాదాన్ని రూపుమాపాలని తాము నిర్ణయించామన్నారు. అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత సభ్యత్వం విషయంలో దక్షిణాఫ్రికా మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాఫ్రికా మద్దతు విషయంలో తమకు మొదటి నుంచీ ఎలాంటి సందేహం లేదని, వలసవాదం, జాతి వివక్ష వంటి జాడ్యాలపై ఇరు దేశాలూ ఉమ్మడిగానే పోరాటం సాగించామని మోదీ గుర్తు చేశారు. దక్షిణాఫ్రికా పర్యటన తనకు ఓ అరుదైన అవకాశం ఇచ్చిందని, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాలకు ఘన నివాళులు అర్పించగలిగానని అన్నారు. ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాల వల్ల మరింత బలమైన సహకారానికి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎంతో ఆస్కారం ఏర్పడిందన్నారు.
కేవలం ప్రభుత్వాల మధ్యేకాకుండా, ఇరు దేశాల ప్రజల మధ్య కూడా బలమైన మైత్రీబంధాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సంకల్పించామని చెప్పారు. ద్వైపాక్షిక అంశాలకే పరిమితం కాకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లపై కూడా ఉమ్మడిగా కృషి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. నాలుగు ఆఫ్రికా దేశాల్లో ఐదురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొజాంబిక్ నుంచి శుక్రవారం ప్రిటోరియా వచ్చారు.

చిత్రం... దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రిటోరియాకు
వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు
జాకబ్ జుమాతో సంయుక్త విలేఖరుల సమావేశానికి
ముందు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న దృశ్యం