అంతర్జాతీయం

దద్దరిల్లిన డల్లాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, జూలై 8: అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. డల్లాస్‌లో పోలీసులపై ఆందోళనకారులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గత రెండు రోజుల్లో లూసియానా, మినె్నసోటాల్లో పోలీసులు ఇద్దరు నల్లజాతీయులను కాల్చి చంపడంపై మొదలైన ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు కూడా పాకాయి. డల్లాస్ నగరంలో గురువారం రాత్రి ఎత్తయిన భవనంపైన దాక్కున్న ఇద్దరు ఆందోళనకారులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మృతి చెందినట్లు డల్లాస్ పోలీసు అధికారి డేవిడ్ బ్రౌన్ విలేఖరులకు చెప్పారు. నగరంలో రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్‌తో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకదాని దగ్గర ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు సైతం ఓ పార్కింగ్ గ్యారేజిలో దాక్కున్న ఒక అనుమానితుడిపై గంటల సేపు కాల్పులు జరిపారని, ఆ అనుమానితుడు మృతి చెందినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు.
కాగా, పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు, వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు బ్రౌన్ చెప్పారు. టెక్సాస్ డౌన్‌టౌన్ ప్రాంతంలో బాంబులు పెట్టినట్లు ఓ అనుమానితుడు పోలీసులను బెదిరించాడని కూడా ఆయన చెప్పారు. పోలీసులపై కాల్పులు జరిపిన మరో వ్యక్తి తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో డల్లాస్ మీదుగా వెళ్లాల్సిన విమానాలపై విమానయాన అధికారులు ఆంక్షలు విధించారు.