అంతర్జాతీయం

పోలీసులపై దాడులు దారుణం: ఒబామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, జూలై 8: పథకం ప్రకారం పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమెరికాలో జరుగుతున్న ఈ దాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని, అత్యంత హేయమని అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఈ దాడులు అంతటినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఒక ప్రకటనలో అన్నారు. నాటో సమావేశాల్లో పాల్గొనడం కోసం ప్రస్తుతం పోలండ్ రాజధాని వార్సాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఘటనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులపై కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. అయితే ఇప్పటిదాకా అందిన వివరాలు అత్యంత హేయమైనవి, దారుణమైనవని అన్నారు. లా ఎన్‌ఫోర్సమెంట్ అధికారులపై దాడులు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. తాను డల్లాస్ మేయర్ మైక్ రాలింగ్స్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపిన ఒబామా జరిగిన సంఘటన పట్ల సంతాపాన్ని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు తెలిపారు. అంతకు ముందు వార్సా చేరుకున్న ఒబామా విలేఖరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నల్లజాతీయులపై పోలీసులు కాల్పులు జరపడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
జాతి వివక్ష కారణంగానే నల్లజాతీయులపై దాడులు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ గణాంకాలను బట్టి చూస్తే తెల్లజాతీయులతో పోలిస్తే నల్లజాతీయులపైనే పోలీసు దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తుందన్నారు. తెల్లజాతివారికన్నా నల్లజాతి వారిని రెండు మూడుసార్లు తనిఖీ చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు ఒక్క నల్లజాతివారికే కాక మొత్తం అమెరికన్లకు నష్టం కలిగిస్తాయన్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థలో పాతుకు పోయిన జాతి వివక్షను అంతమొందించడానికి కృషి చేస్తున్నామన్నారు. అదే సమయంలో ఆయన శాంతిభద్రతలను కాపాడడానికి పోలీసులు జరుపుతున్న కృషిని సైతం అభినందించారు.