అంతర్జాతీయం

సత్యాగ్రహానికి పుట్టినిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహెనె్నస్‌బర్గ్, జూలై 8: ప్రపంచానికి అహింసను బోధించిన సత్యాగ్రహానికి దక్షిణాఫ్రికా పుట్టినిల్లని, మోహన్‌దాస్ మహాత్ముడిగా మారింది ఈ గడ్డమీదేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మొత్తం దక్షిణాఫ్రికా సమాజాన్ని హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ, ఉర్దూ భాషలు మరింత సుసంపన్నం చేస్తున్నాయని శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇక్కడ జరిగిన ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య పెనవేసుకున్న సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక వారసత్వ బంధం పటిష్టమైనదని, రెండు దేశాలు తరతరాలుగా సన్నిహితం కావడానికి ఈ బంధమే దోహదం చేస్తోందని స్పష్టం చేశారు. ఈరెండు దేశాల ప్రజలు మనసులు కలిశాయని, హృదయాలు పెనవేసుకున్నాయని చెప్పారు. జాతి వివక్ష అనంతర కాలంలో దక్షిణాఫ్రికాను గుర్తించిన మొట్టమొదటి దేశం భారతేనని వెల్లడించారు. ది డోమ్ అన్న ప్రాంతంలో జరిగిన ఈ సమావేశానికి పదిహేను వేల మంది ఎన్నారైలు హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి ఈ సమావేశానికి ప్రజలు తరలిరావడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తుందని మోదీ అన్నారు.‘మీ ప్రేమ ఆప్యాయతలు నా పర్యటనను మరింత ఉన్నతంగా మలిచాయి’ అన్నారు. 150 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను తెలియజేశారు. భిన్న భౌగోళిక ప్రాంతాల్లో ఉన్న భారత్, దక్షిణాఫ్రియాకు ఉమ్మడి వారసత్వం ఉందని అది తిరుగులేని బంధం అని తెలిపారు.
చారిత్రకంగా మన పూర్వీకులు విడిపోయినా, మన జాతీయత భిన్నమైనదైనా క్రికెట్ టీమ్‌లలో మనం ఇచ్చే మద్దతు భిన్నమైనదైనా ఇరుదేశాలకు ఘనమైన చారిత్రక వారసత్వం ఉందని ప్రధాని చెప్పారు. శతాబ్దాల క్రితమే భారతీయలు దక్షిణాఫ్రికా వచ్చారని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నా చాలా బలంగా నిలబడ్డారని పేర్కొన్నారు.