అంతర్జాతీయం

టర్కీలో మళ్లీ దాడులు ..అయిదుగురు సైనికులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, జూలై 10: టర్కీలో ఉగ్రవాదులో మరోసారి తెగబడ్డారు. నిషిద్ధ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మిలిటెంట్లు ఆదివారం జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో అయిదుగురు సైనికులను, ఒక గ్రామ రక్షకుడిని హత్య చేశారు. ఈ దాడుల్లో కనీసం 15మంది గాయపడినట్లు చెప్తున్నారు. తూర్పు ప్రావిన్స్ దగ్గర మిలిటెంట్లు పేల్చిన కారుబాంబుతో ఒక సైనికుడు, గ్రామ రక్షకుడు చనిపోయారు. మధ్యాహ్నం కుర్దిష్ ప్రావిన్స్‌లో సైనిక వాహనంపై బాంబు విసరటంతో నలుగురు జవాన్లు చనిపోయారు. కుర్దిష్ మిలిటెంట్లను ఏరివేయటానికి టర్కీ సైన్యం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది.