అంతర్జాతీయం

రోదసిలో గెలాక్సీల రారాజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 12: రోదసి లోతుల్లో ఓ అద్భుతమైన మిస్టరీ నక్షత్ర మండలాన్ని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. భూమికి 250 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ మహా గెలాక్సీని ఫ్రాంకెన్ స్టీల్‌గా పేర్కొనవచ్చునని, అనేక గెలాక్సీల భాగాల కలయికగా ఇది ఏర్పడిందని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ఇంతకుముందు దీనికి సంబంధించి లేశప్రాయమైన సంకేతాలను అందుకున్నప్పటికీ శాస్తవ్రేత్తలు ఊహించిన దానికంటే ఈ గెలాక్సీ ఏకంగా పదిరెట్లు పెద్దదని అత్యంత ప్రాచీనమైనదని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌లు, అబ్జర్వేటరీలను ఉపయోగించి అత్యంత సుదూరమైన, ప్రాచీనమైన యుజిసి 1382 అనే ఈ గెలాక్సీని కనుగొన్నారు. అయితే మిగతా గెలాక్సీలకంటే దీనికి అనేక ప్రత్యేకతలున్నాయని, పైకి వృద్ధ నక్షత్ర మండలంగా కనిపిస్తున్నప్పటికీ దీని అంతర్భాగం మాత్రం ఎంతో తేజోవంతంగా ఉందని వెల్లడించారు. అంతేగాకుండా దీని ఆకృతిని బట్టి చూస్తే అనేక నక్షత్ర మండలాల భాగాలను కలుపుకొని ఇది ఆవిర్భవించి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా కలుగుతోందని వెల్లడించారు. పైగా ఈ గెలాక్సీ ఉన్న భాగంలో ఇతర గెలాక్సీలేవీ లేకపోవడం వల్ల ఇది ఏకాకిగా కనిపిస్తోందని కార్నీజ్ శాస్త్ర పరిశోధనా కేంద్రానికి చెందిన మార్క్ సి బెర్త్ అనే ఖగోళ శాస్తవ్రేత్త వెల్లడించారు. ఆయనతోపాటు లీ హాగన్ అనే మరో శాస్తవ్రేత్త అనుకోని విధంగానే ఈ ప్రాచీన గెలాక్సీని కనుగొనగలిగారు.