అంతర్జాతీయం

అది భారత్ ఆంతరంగిక వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 12: కాశ్మీర్ అంశం భారత దేశ ఆంతరంగిక వ్యవహారమని అమెరికా విస్పష్టంగా తెలియజేసింది. ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతున్న ఘర్షణలు, హింసాకాండపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి స్పష్టం చేశారు. హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్ గుర్హన్ వని భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన నేపథ్యంలో ఒక్కసారిగా కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాశ్మీర్ వ్యవహారం భారత్‌కు సంబంధించింది కాబట్టి ఈ అంశంపై తాము ఆ దేశ అధికారులతో మాట్లాలేదని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి వెల్లడించారు. అంతర్గత చర్యల ద్వారానే కాశ్మీర్ సమస్యను,ప్రస్తుత పరిస్థితిని భారత్ పరిష్కరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ఉగ్రవాదం, తీవ్రవాదాలను పాకిస్తాన్ ఆయుధాలుగా మార్చుకోవడంవల్లే అంతర్జాతీయంగా ఇస్లామిక్ తీవ్రవాదం పెచ్చరిల్లుతోందని అమెరికా మాజీ దౌత్యవేత్త జల్మేఖలీల్‌జాద్ అన్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంగా పరిగణించాలని ఆయన సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు పాకిస్తానే కారణమని, అలాగే భారత్‌ను బెదిరించడంతోపాటు ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకోవడం వల్ల అంతర్జాతీయంగా శాంతికి ముప్పువాటిల్లుతోందని జాద్ తెలిపారు. 9/11 తరువాత అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్‌లకు సంబంధించి అమెరికా విధానాన్ని రూపొందించడంతో ఖలీద్‌జాద్ కీలక పాత్ర పోషించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ముందుగా పాకిస్తాన్‌ను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు సంబంధించి తన అభిప్రాయాలను అమెరికా ప్రతినిధుల సభ విదేశాంగ వ్యవహారాల కమిటీకి నివేదించారు.

అమెరికా మాజీ దౌత్యవేత్త జల్మేఖలీల్‌జాద్