అంతర్జాతీయం

పాక్‌లో సైనిక పాలన రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 12: పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని గద్దె దింపి, సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ పాక్‌లో ఒక రాజకీయ పార్టీ కొత్త ప్రచారాన్ని లేవదీసింది. ‘మూవ్ ఆన్ పాకిస్తాన్’ అనే రాజకీయ పార్టీ ఈ కొత్త ప్రచారానికి తెరదీసింది. ఈ మేరకు లాహోర్, కరాచీ పెషావర్, క్వెట్టా, రావల్పిండి, ఫైసలాబాద్ తదితర 13 నగరాల్లో మంగళవారం ఏకకాలంలోపెద్ద ఎత్తున పోస్టర్లు ప్రత్యక్షమైనాయి. పాక్‌లో సైనిక పాలన విధించాల్సిన సమయం ఆసన్నమైందని, ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ స్వయంగా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకోవాలని ఆ పార్టీ ఆ పోస్టర్లలో డిమాండ్ చేసింది. గత నవంబర్‌లో రహీల్ రాజీనామా చేస్తానని ప్రకటించినప్పుడు మూవ్ ఆఫ్ పాకిస్తాన్ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది కూడా. అయితే ఆర్మీ కంటోనె్మంట్‌లకు దగ్గర్లోనే ఈ బ్యానర్లు, పోస్టర్లు కనిపించడాన్ని చూస్తే సైన్యంలో లోలోపల ఏదో జరుగుతోందన్న అనుమానాలు కూడా బలవమవుతున్నాయని విశే్లషకులు అంటున్నారు. కరాచీలో ముఖ్యమంత్రి నివాసానికి, రేంజర్స్ ప్రధాన కార్యాలయంకు వెళ్లే దారుల మధ్య ఉండే జంక్షన్ వద్ద వేళ్లాడదీసిన బ్యానర్‌పై ‘జానాకి బాతేన్ హుయి పురానీ, ఖుదాకే లియే అబ్ ఆజావో’(పదవినుంచి వైదొలగుతాననే మాట పాతదై పోయింది. దేవుడి దయవల్ల ఇప్పుడు దేశం బాధ్యతలు స్వీకరించు) అన్న నినాదం ఉంది. పాకిస్తాన్‌లో సైనిక పాలన విధించాల్సిన సమయం ఆసన్నమైందని, ఆర్మీ చీఫ్ రహీల్ స్వయంగా ప్రభుత్వ బాద్యతలు చూసుకోవాలన్నది తమ ప్రచారం ప్రధాన ఉద్దేశమని ‘మూవ్ ఆన్ పాకిస్తాన్’ పార్టీ చీఫ్ ఆర్గనైజర్ అలీ హాష్మి డాన్ పత్రికతో అన్నారు. ఈ బ్యానర్లపై ఆర్మీ వర్గాలు పెదవి విప్పనప్పటికీ అనేక చెక్‌పాయింట్లు, అదనపు భద్రత ఉన్నప్పటికీ కంటోనె్మంట్ ఏరియాలతో పాటుగా 13 నగరాల్లోని ప్రధాన మార్గాలన్నిటిలో పెద్ద ఎత్తున ఈ తరహా బ్యానర్లు ప్రత్యక్షం కావడం బట్టి చూస్తే ఏదో జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయని విశే్లషకులు అంటున్నారు.