జాతీయ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ కెప్టెన్ అజర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్, ప్రియాంకలతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తోనూ పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానంలో మైనారిటీలకు లేదా ఎస్‌సిలకు చెందిన నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన అనంతరం పలు పేర్లను పరిశీలించినట్లు ఏఐసిసికి చెందిన సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. మైనారిటీ వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్, విధాన మండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు షబ్బీర్ అలీ పేర్లు సహా అజారుద్దీన్ అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించారు. ఎస్‌సి వర్గం నుంచి సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క, సంభాని చంద్రశేఖర్, గీతారెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చినట్టు చెబుతున్నారు. సోనియా ఈ జాబితాపై రాజ్యసభలో పార్టీ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మరికొందరు సీనియర్ నాయకులతో పలు దఫాలుగా చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత చివరకు అజారుద్దీన్ పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీ ఆలోచనా విధానానికి అనుగుణంగా పనిచేయటంతోపాటు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సిద్ధం చేసే ఎన్నికల ప్రణాళికలకు మాజీ కెప్టెన్ సరిగ్గా సరిపోతారని హైకమాండ్ భావించినట్టు చెబుతున్నారు.
దిగ్విజయ్ వారసుడి ఎంపిక
తెలంగాణ ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ స్థానంలో కొత్త వారిని నియమించే అంశం కూడా కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించి టిపిసిసి బాధ్యతలు అప్పగించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయ.