అంతర్జాతీయం

నేపాల్ ప్రధాని ఓలిపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, జూలై 13: నేపాల్‌లో ప్రధాని కెపి ఓలిపై ప్రతిపక్ష పార్టీలు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ప్రచండ నేతృత్వంలోని మావోయిస్టు పార్టీ మద్ద తు ఉపసంహరించుకోవడంతో ప్ర ధాని కెపి ఓలి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడి పోయినప్పటికీ ఆయన పదవినుంచి దిగిపోవడానికి నిరాకరించడంతో ఆయనను గద్దె దించడం కోసం ప్రతిపక్ష పార్టీలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. సిపిఎన్ (మావోయిస్టు సెంటర్), నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్-యునైటెడ్ పార్టీలు కలిసి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడమే కాకుండా ప్రతిపక్షాల మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాయి. 601 మంది సభ్యులున్న నేపాల్ రాజ్యాంగ సభలో నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన 183 మంది, మావోయిస్టు పార్టీకి చెందిన 70 మంది, సిపిఎన్-యునైటెడ్‌కు చెందిన ముగ్గురు సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసిన తర్వాత ఈ అవిశ్వాస తీర్మానాన్నిపెడుతున్నట్లు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా చెప్పినట్లు ‘ఖాట్మండు పోస్ట్’ పత్రిక తెలిపింది. ఈ మూడు పార్టీలకు కలిపి పార్లమెంటులో 292 మంది సభ్యుల బలం ఉంది. ఓలికి చెందిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్( యునైటెడ్ మార్క్సిస్టు లెనినిస్టు) పార్టీకి 175 మంది సభ్యులే ఉన్నారు. విశ్వాస తీర్మానం నెగ్గాలంటే 299 మంది సభ్యులు అవసరం కాగా, ఆ పార్టీకున్న బలం ఏమాత్రం సరిపోదనేది సుస్పష్టం. ఇదిలా ఉండగా, పార్లమెంటులో మొత్తం 50 మంది సభ్యుల బలం ఉన్న ఆరు మాధేసీ పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాయి.