అంతర్జాతీయం

ఎన్‌ఎస్‌జిలో చేరడానికి ఎన్‌పిటి తప్పనిసరి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 13: అణు సరఫరా దేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం తప్పని సరికాదని అయితే దాని నిబంధనలకు కట్టుబడి ఉండడం ముఖ్యమని అమెరికాకు చెందిన మేధావుల వేదిక అయిన ‘కార్నిగే ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’లో న్యూక్లియర్ పాలసీ ప్రో గ్రా మ్ సీనియర్ అసోసియేట్ అయిన మార్క్ గిబ్స్ ‘న్యూక్లియర్ ఇంటెలిజన్స్’ వారపత్రికలో రాసిన సంపాదకీయ వ్యాసం లో పేర్కొన్నారు. చైనా వ్యతిరేకత కారణంగా భారత్ సభ్యత్వ విషయంపై 48 దేశాలు సభ్యులుగా ఉన్న అణు సరఫరాదేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి) ఒక నిర్ణయం తీసుకోలేకపోయిన కొద్ది వారాలకే ఈ వ్యాసం రావడం గమనార్హం. ఈ డైలమానుంచి బైటపడడానికి భారత్ కొన్ని కొలమానాలను నెరవేర్చడం లేదా సభ్యత్వానికి అవసరమైన నిబంధనలను పాటించడం ఒక మార్గమని హిబ్స్ అభిప్రాయ పడ్డారు. ఎన్‌ఎస్‌జి సభ్యత్వానికి ఎన్‌పిటిలో సభ్యత్వం అవసరం లేదని, అయితే దానిలోని ముఖ్య అంశాలకు కట్టుబడి ఉండ డం ముఖ్యమని, భారత్‌ను గనుక ఆ న్యాయపరమైన నిబంధనలకు కట్టుబడేలా చేయగలిగినట్లయితే అది ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి దగ్గరయినట్లేనని ఆయన అన్నారు. అంతేకాదు, తన సొంత నియమ నిబంధనల ప్రకారం భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి ఏమయినా అడ్డంకులున్నాయా అనే విషయాన్ని కూడా ఎన్‌ఎస్‌జి పరిశీలించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. భారత సభ్య త్వం సమస్యను ఎన్‌ఎస్‌జి ఎలా పరిష్కరించగలుగుతుందనేది రొటేషన్ పద్ధతిలో 2017 మధ్య దాకా ఎన్‌ఎస్‌జి చైర్మన్ పదవిలో ఉండే దక్షిణ కొరియా, అంతకు ముందు చైర్మన్‌గా ఉండిన అర్జెంటీనా చేతుల్లో ఉందని హిబ్స్ ఆ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. సభ్య దేశాలతో వాళ్లు చర్చలు కొనసాగించినట్లయితే, కొంత పురోగతి సాధిస్తే, భారత్ దరఖాస్తును తిరిగి పరిశీలించడం కోసం మళ్లీ అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని ఆయన ఆ వ్యాసంలో అన్నారు.