అంతర్జాతీయం

మిషెల్లి ప్రసంగాన్ని కాపీకొట్టిన మెలానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లీవ్‌లాండ్, జూలై 19: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలనాలు, వివాదాలకు మారుపేరైన డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా కూడా ఆయన బాటలోనే పయనిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో చాలా తక్కువగా ప్రజల్లోకి వచ్చిన మెలానియా రిపబ్లికన్ జాతీయ కనె్వన్షన్‌లో ఓ అద్భుతమైన ప్రసంగం చేశారు. విచిత్రమేమంటే ఈ మొత్తం ప్రసంగంలో ఏ ఒక్క అక్షరమూ ఆమె సొంతం కాదు. ఆమె అనుచరులు రాసింది కాదు.. ఇదంతా 2008లో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్లి ఒబామా డెమొక్రాట్ల కనె్వన్షన్‌లో చేసిన ప్రసంగాన్ని అక్షరం పొల్లుపోకుండా రిపబ్లికన్‌ల కనె్వన్షన్‌లో మాట్లాడేశారు. యథాతథంగా లిఫ్ట్ చేసేశారు. ‘‘నా తల్లిదండ్రులు తమ విలువలతో నన్ను ప్రభావితం చేశారు. జీవితంలో నీవేం కావాలనుకున్నావో అది సాధించటానికి కష్టపడాలన్నది వారి సందేశం. నా దైనందిన జీవితంలో ఈ విలువలే నన్ను ముందుకు నడిపిస్తాయి. నా కుమారుడికి కూడా అదే సందేశాన్ని నేను అందించాను’’ అని మెలానియా అన్నారు. ఈ మాటలు అక్షరాక్షరాలు మిషెల్లీ ఎనిమిదేళ్ల క్రితం చేసిన ప్రసంగంలోనివే కావటం విశేషం. దీనిపై ట్రంప్ సీనియర్ సమాచార సలహాదారు ఖండించారు.