అంతర్జాతీయం

రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లీవ్‌లాండ్, జూలై 20: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేట్ అయ్యారు. క్లీవ్‌లాండ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ కనె్వన్షన్‌లో ట్రంప్‌ను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అమెరికాలో రియల్ ఎస్టేట్ టైకూన్ అయిన డొనాల్డ్ ట్రంప్ (70) సరిగ్గా ఏడాది క్రితమే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రపంచ దేశాలన్నింటినీ విస్మయపరిచే విధంగా అత్యంత వివాదాస్పద ప్రచారంతో ప్రైమరీల్లో మొత్తం 17మంది ప్రత్యర్థులను ఓడించి అభ్యర్థిత్వానికి అవసరమైన 1237మంది ప్రతినిధుల మద్దతును ట్రంప్ సంపాదించారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించి అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ నామినీగా ఎన్నికయ్యారు’’ అని ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ రయాన్ బుధవారం ప్రకటించారు. పార్టీ నామినీగా తనను ఎన్నుకున్నందుకు ట్రంప్ రిపబ్లికన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. తాను మరింత కష్టపడతానని, రిపబ్లికన్లను ఓడనివ్వనని, అమెరికాయే తనకు మొదటి ప్రాధాన్యమని ట్రంప్ ట్వీట్ చేశారు. ‘‘అమెరికా అధ్యక్ష పదవిని మనం గెలుచుకోబోతున్నాం. గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నాం. మళ్లీ మంచి నాయకత్వం వాషింగ్టన్‌కు రాబోతోంది. మన ఉద్యోగాలు మనం వెనక్కి రప్పించుకుంటాం. మన సైనిక వ్యవస్థను మళ్లీ పటిష్ఠం చేస్తాం. సరిహద్దులను బలోపేతం చేస్తాం’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెట్టడమే లక్ష్యమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మా నాన్న అసాధ్యుడు
డొనాల్డ్ ట్రంప్‌కు కుమారుడి కితాబు
‘అసాధ్యాన్ని సాధించే ట్రాక్ రికార్డు మా నాన్న సొంతం’ అంటూ అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ కుమారుడు అంటే, ఆయన కుమార్తె మరో అడుగు ముందుకేసి తన తండ్రి పుట్టుకతోనే ప్రోత్సహించే సహజ గుణం ఉన్నవాడని అంటోంది.
ట్రంప్‌ను రానీయొద్దు: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో అడుగుపెట్టనివ్వకూడదని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రంప్ నామినేషన్‌ను రిపబ్లికన్ పార్టీ ధృవీకరించిన కొద్ది గంటల్లోనూ ఆమె ఈ ప్రకటన చేశారు.