అంతర్జాతీయం

అమెరికాతో యుద్ధానికి సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 22: దక్షిణ చైనా సముద్రంపై తన హక్కులను తోసివేస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు చెందిన ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చైనా మిలిటరీ తాజాగా పలు కొత్త ఆయుధాలను ఆవిష్కరించింది. వీటిలో సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయడానికి ఏ దేశమైనా పూనుకుంటే చైనా తన ప్రయోజనాల పరిరక్షణ కోసం యుద్ధానికి సన్నద్ధంగా ఉందని ఆ దేశ ఉన్నతాధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఈ కొత్త ఆయుధాల ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ)కి చెందిన ‘ద సదరన్ థియేటర్ కమాండ్’ సముద్ర జలాల్లో ఉండి, గగనతలం నుంచి యుద్ధం చేయడానికి సంబంధించిన ఈ ఆయుధాలను ఉన్నత స్థాయి సైనికాధికారుల సందర్శన సందర్భంగా ఆవిష్కరించింది. పిఎల్‌ఎ దక్షిణ చైనా సముద్రం వ్యవహారాలను చూడటానికే కొత్తగా ‘ద సదరన్ థియేటర్ కమాండ్’ను ఏర్పాటు చేసింది. అధికార టెలివిజన్ ఈ కొత్త ఆయుధాలను ప్రదర్శించింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికాతో యుద్ధం చేయడానికి కూడా సదరన్ థియేటర్ కమాండ్ సిద్ధంగా ఉందని తెలియజేయడానికే ఎన్నడూ లేని రీతిలో చైనా కొత్త ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించిందని సైనిక నిపుణులు పేర్కొంటున్నారని హాంకాంగ్ నుంచి వెలువడుతున్న ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ శుక్రవారం తెలిపింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తరువాత అతి పెద్ద సైనికాధికారి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సిఎంసి) వైస్ చైర్మన్ జనరల్ ఫాన్ చాంగ్‌లాంగ్ సందర్శన సందర్భంగా ఈ కొత్త ఆయుధాలను ఆవిష్కరించారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని జనరల్ ఫాన్ చైనా బలగాలకు పిలుపునిచ్చారు. ఫాన్‌తో పాటు పిఎల్‌ఎ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ జనరల్ మా జియోటియన్, ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ చీఫ్ జనరల్ వెయి ఫెంఘే ఉన్నారు. చైనా క్షిపణుల గిడ్డంగిని ఈ రాకెట్ ఫోర్సే నిర్వహిస్తుంటుంది.