అంతర్జాతీయం

జర్మనీ షాపింగ్ మాల్‌లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూలై 22: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఓ ఆగంతకుడి కాల్పుల్లో పది మందికి పైగా మరణించినట్టు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒలిపింక్ స్టేడియం సమీపంలో ఉన్న మ్యూనిచ్ షాపింగ్ సెంటర్లో ఉన్నవారిపై అతడు కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల అనంతరం అతడు మెట్రో స్టేషన్ దిశగా పరుగులు పెట్టినట్టుగా ది బిల్డ్ అనే పత్రిక తెలిపింది. గత కొన్ని నెలలుగా ఐరోపాను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని దేశాలన్నీ గరిష్టస్థాయి అప్రమత్తతను పాటిస్తున్నాయి. కాల్పులు జరిగిన వెంటనే ఈ ప్రాంతాన్ని దిగ్బంధం చేసిన పోలీసులు సాయుధుడి కోసం విస్తృతంగా గాలింపుచర్యలు చేపట్టారు. ఎవరూ నగరం వదలి వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. పొరుగునే ఉన్న ఫ్రాన్స్‌లో జిహాదీ దాడులు జరిగినప్పటికీ జర్మనీలో మాత్రం ఈ తరహా దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.