అంతర్జాతీయం

18 ఏళ్లకే ప్రతినిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలడెల్ఫియా, జూలై 29: అమెరికాలో అధికార పక్షమైన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కనె్వన్షన్‌లో అతి చిన్న వయసు గల డెలిగేట్‌గా భారత సంతతికి చెందిన 18 ఏళ్ల యువతి శ్రుతి పలనియప్పన్ అందరి దృష్టిని ఆకర్షించారు. సెడార్ రాపిడ్స్ నుంచి ఈ కనె్వన్షన్‌కు వచ్చిన శ్రుతి హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నారు. హిల్లరీ క్లింటన్‌కు ఆమె గట్టి మద్దతుదారు. శ్రుతి తండ్రి పలనియప్పన్ ఆండియప్పన్ కూడా క్రెడెన్షియల్స్ కమిటీ సభ్యుడిగా ఈ కనె్వన్షన్‌కు హాజరయ్యారు. కనె్వన్షన్‌లో అరిజోనా నుంచి వచ్చిన 102 ఏళ్ల జెర్రి ఎమ్మెట్ అందరికన్నా ఎక్కువ వయసు గల డెలిగేట్‌గా నిలిచారు. అతి చిన్న వయస్కురాలయిన ప్రతినిధిగానే కాకుండా శ్రుతి మంగళవారం ‘రోల్ కాల్ వోట్స్’ సందర్భంగా లోవాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొంది మరో చరిత్ర సృష్టించారు. ‘రోల్ కాల్ స్పీకర్’గా లోవా డెలిగేషన్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.