అంతర్జాతీయం

యూరిన్ నుంచి బీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 31: విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అసహ్యమేసినా ఇదే వాస్తవం.. ఐరోపా శాస్తవ్రేత్తలు యూరిన్ నుంచి బీర్‌ను తయారు చేసే యంత్రాన్నొకదాన్ని కనుగొన్నారు. సౌరశక్తితో పనిచేసే ఈ యంత్రం మానవ మూత్రం నుంచి నీటిని, ఎరువును వేరు చేస్తుంది. ఈ ఎరువు బీరు ఉత్పాదక పంటలకు ఉపయోగపడుతుందిట. బెల్జియం ఘెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు ఈ దిశగా విజయవంతమైన పరిశోధనలు చేశారు. ముందుగా ఒక ట్యాంక్‌లో యూరిన్‌ను సేకరించి, సౌరశక్తి డివైస్‌తో దాన్ని వేడి చేస్తారు. దాన్నుంచి నీరును, ‘టెక్స్‌ప్లోర్’ అనే ఎరువును వేరు చేస్తారు. ఈ యంత్రం యూరిన్‌లోంచి 95శాతం అమ్మోనియాను తొలగిస్తుంది. ఇది నీటిని ఎంతగా శుభ్రం చేస్తుందంటే, ఆ నీరును మంచినీరుగా తాగవచ్చని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు.