అంతర్జాతీయం

రిగ్గింగ్ జరుగుతుందేమో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 2: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే తీరుపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యమైన ఆరోపణ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమోనని ఆందోళనగా ఉందన్నారు. ‘‘నాకు భయంగా ఉంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమోనని. నేను నిజాయితీగా ఉండాలి’’ అని కొలంబస్ టౌన్‌హాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు. డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ బెర్నీసాండర్స్ ఒక్కరితోనే పోరాడారని, తాను 17మందిని ఓడించి అభ్యర్థిత్వాన్ని సాధించానని ఆయన తెలిపారు. బెర్నీ సరైన ఒప్పందం కుదుర్చుకోకపోవటం వల్లనే ఆయన ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నికల్లో రిగ్గింగ్ అవుతుందేమోనని ఆందోళనగా ఉంది. మనం భారీ మెజార్టీతో గెలవకపోతే న్యూయార్క్, ఇండియానా, కాలిఫోర్నియాలో 78శాతం ఓట్లతో ఇతరులతో ప్రైమరీల్లో గెలిచిన తీరుపై ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. నవంబర్ 8న జరిగే ఎన్నికలకు మనం దాదాపుగా చేరువయ్యాం. ఈ మాట నేను గత జూన్ 16నాడే చెప్పాను. మనం ఇక దాన్ని సాధించాలి. ఇందుకు ధైర్యం కావాలి’’ అని అన్నారు.
మరోవైపు పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ సైనికుడి తండ్రికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. అమెరికాలో ప్రవేశించేవారికి మత పరీక్షలు నిర్వహించాలని ట్రంప్ వ్యాఖ్యానించటం అగౌరవమని అతని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.