అంతర్జాతీయం

పంద్రాగస్టున ఎంఎస్‌కు ఐరాసలో నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 9: విశ్వ విఖ్యాత సంగీత విద్వాంసురాలు, భారత రత్న, స్వర్గీయ ఎంఎస్ సుబ్బులక్ష్మికి ఐక్యరాజ్యసమితిలో అరుదైన గౌరవం దక్కనుంది. ఆస్కార్ అవార్డు విజేత ఆధునిక సంగీత రారాజు ఏఆర్ రహమాన్ నేతృత్వంలో భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఘనమైన నివాళి సమర్పించనున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి సమీపిస్తున్నందున ఆమెకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను కూడా ఐక్యరాజ్యసమితిలోని భారత కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారని సమితిలో భారత దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం ట్వీట్ చేశారు. ఆగస్టు 15 నుంచి 19 వరకు ఎంఎస్ స్మృతిలో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 50 సంవత్సరాల క్రితం 1966లో ఐరాస జనరల్ అసెంబ్లీ కార్యాలయంలో ఎంఎస్ తన సంగీత కచ్చేరీ నిర్వహించారు. ఆ తరువాత మళ్లీ సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్న కళాకారుడు ఎఆర్ రహమాన్ ఒక్కడే. ఐక్యరాజ్యసమితిలో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ హాజరవుతారని అక్బరుద్దీన్ వెల్లడించారు.