అంతర్జాతీయం

భూతాపం కారణంగా సైనికులకు ప్రాణాంతకంగా మారిన సియాచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియాచిన్, ఆగస్టు 14: వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మంచు వేగంగా కరిగిపోతుండడంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, కఠినమైన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో విధులు నిర్వహించే సైనికుల జీవితాలు కష్టతరం కావడమే కాకుండా ప్రమాదకరంగా మారుతున్నాయి. శత్రువుల తుపాకి తూటాలకన్నా కూడా విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారంగానే సియాచిన్‌లో ఎక్కువమంది సైనికులు చనిపోతున్నారు. ఇక్కడ ఒక్కోసారి వాతావరణం మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతూ ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో అత్యంత క్లిష్టమైన సోనమ్ సైనిక స్థావరం సమీపంలో మంచు చరియలు విరిగిపడ్డ కారణంగా పది మంది సైనికులు చనిపోవడానికి భూతాపం పెరిగిపోవడమే కారణం. ‘సోనమ్ వద్ద జరిగిన సంఘటన పూర్తిగా వాతావరణ మార్పు ఫలితమే. ఎందుకంటే సాధారణంగా మనకు మంచు కొండచరియలు విరిగిపడ్డం ఉండదు. సోనమ్‌లో జరిగింది ఏమిటంటే వేలాడుతున్న ఓ మంచు కొండ చరియ ఓ మంచు గోడను ఢీకొని కూలిపోయింది. ప్రమాదం జరగడానికి 15 రోజుల ముందునుంచి ఉష్ణోగ్రతలు పెరగడమే దీనికి కారణం’ అని సియాచిన్ యుద్ధ తంత్ర శిక్షణా కేంద్రం లెఫ్టెనెంట్ కల్నల్ ఎస్ సేన్ గుప్తా చెప్పారు. దాదాపు 19,600 అడుగుల ఎత్తులో ఉన్న సోనమ్ పోస్టు వద్ద మంచు కింద 30 అడుగుల లోతులో ఆరు రోజులపాటు సమాధి తర్వాత సైనికులు కొనప్రాణాలతోకాపాడిన లాన్స్ నాయక్ హనుమంతప్పను రక్షించుకోలేక పోయిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల కారణంగా హిమనదాలు బద్దలవుతున్నాయని, ఫలితంగా మంచుగడ్డలు తొలగిపోయి అగాథం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇవి అక్కడి సైనికుల పాలిట మృత్యు కుహరాలవుతున్నాయని సేన్ గుప్తా చెప్పారు.
సైన్యం ఇప్పుడు కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఉండడమే కాకుండా తమ స్థావరాలను వీటికి కాస్త దూరానికి తరలించింది కూడా.
మంచు కొండచరియలను దృష్టిలో ఉంచుకొని సైన్యం మంచు కింద కూరుకుపోయిన వారిని సైతం గుర్తించగలిగే రాడార్లను కొనుగోలు చేస్తోందని, అలాగే మంచు కింద కప్పడిపోకుండా ఉండడానికి తమ సైనికులకు వాటిని రిమోట్ ద్వారా పేల్చగలిగే తీవ్రమైన ఒత్తిడి కలిగించే ఒకరకమైన ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అందజేస్తోందని ఆయన చెప్పారు. వాతావరణ మార్పు ప్రభావం ఎంతగా ఉందంటే సియాచిన్ హిమనదంలో ముందుకు పొడుచుకొని వచ్చిన భాగం గత పదేళ్ల కాలంలో దాదాపు 800 మీటర్ల మేర తగ్గిపోయింది.