అంతర్జాతీయం

టర్కీలో ఐఎస్ ఆత్మాహుతి దాడి: 50 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజియాన్‌టెప్ (టర్కీ), ఆగస్టు 21: టర్కీలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 50 మంది మృతి చెందారు. సిరియా సరిహద్దుల్లో ఉన్న ఆగ్నేయ టర్కీలోని గజియాన్‌టెప్ నగరంలో ఒక వివాహానికి హాజరైన ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని అధికారులు ఆదివారం తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి అనేక మంది ఖుర్దులు హాజరయిన వివాహ కార్యక్రమంలో సంభవించినట్టు పేర్కొన్నారు. నాటో కూటమిలో కీలక సభ్యదేశమైన టర్కీలో ఇటీవలి కాలంలో తరచుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల దాడిలో 50 మంది మృతి చెందినట్లు గజియాన్‌టెప్ గవర్నర్ అలీ యెర్లికయా ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని మత బోధకుడు ఫెతుల్లా గులేన్‌కు చెందిన గ్రూపు, నిషిద్ధ ఖుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పికెకె), దాయేశ్ (ఐఎస్)లకు మధ్య ఎలాంటి తేడా లేదని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ విమర్శించారు. ‘మా దేశం, మా జాతి మాపై దాడి చేసేవారికి మళ్లీ ఒకే సందేశం వినిపించింది. మీరు విజయం సాధించలేరు’ అనేదే ఆ సందేశమన్నారు.
వంటికి బాంబులను కట్టుకున్న వ్యక్తి వివాహ వేడుకలోకి ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఖుర్దులు అధిక సంఖ్యలో నివసించే సీరిట్ ప్రాంతానికి చెందిన వారని డోగాన్ వార్తాసంస్థ తెలిపింది. ఆ వివాహ కార్యక్రమంలో తమ సభ్యులు చాలా మంది పాల్గొన్నారని ఖుర్దుల అనుకూల పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (హెచ్‌డిపి) ప్రకటించింది. చాలా మంది మహిళలు, పిల్లలు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు- బెస్నా, నురెట్టిన్ అక్‌డోగాన్ పేలుళ్లలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని హురియత్ డైలీ తెలిపింది. గాయపడిన మరో 98 మందిని వివిధ ఆస్పత్రుల్లో చేర్చారు.
టర్కీలోని అరబ్బులు, కుర్దులు, టర్క్‌మెన్ వంటి విభిన్న ప్రజాసమూహాల మధ్య విభేదాలు సృష్టించడానికి, భిన్న తెగలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి దాడులు చేస్తున్నారని ఎర్డోగాన్ విమర్శించారు.

చిత్రం... ఆత్మాహుతి దాడి జరిగినచోట లభించిన తూటాలు. కన్నీరు మున్నీరవుతున్న బాధితులు