అంతర్జాతీయం

సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, ఆగస్టు 14: బంగ్లాదేశ్ అవతరణకు సహకరించినట్లుగానే తమకు సహాయం చేయాలని బలోచ్ రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపక అధినేత బ్రహుందగ్ బుగ్తి భారత్‌ను కోరారు. బలోచిస్తాన్ ప్రజలు స్వదేశంలో దిక్కులేని వారిగా, నిస్సహాయులుగా జీవిస్తున్నారని పేర్కొంటూ, లిబియా, సిరియాలలో జోక్యం చేసుకోగలిగిన అంతర్జాతీయ సమాజం బలోచిస్తాన్‌లో ఎందుకు జోక్యం చేసుకోకూడదని ప్రశ్నించారు. అక్బర్‌ఖాన్ బుగ్తి మనుమడయిన బ్రహందగ్ బుగ్తి ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ విజ్ఞప్తి చేశారు.
‘వారు (పాకిస్తాన్) మమ్మల్ని ఉగ్రవాదులు అంటున్నారు. మేము భారత్ మద్దతు పొందుతున్నామని అంటున్నారు. మాకు సహకరించాలని మేము అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాం. అంతర్జాతీయ సమాజం వచ్చి ఇక్కడి పరిస్థితిని పరిశీలించాలి. ప్రతిదానినీ పర్యవేక్షించాలి. లిబియా, సిరియాలలో జోక్యం చేసుకోగలిగిన మీరు బలోచిస్తాన్‌లో ఎందుకు జోక్యం చేసుకోలేరు? పాకిస్తాన్‌లో జరుగుతున్న వాటన్నింటినీ ఎవరూ ఊహించజాలరు. ఇక్కడి ప్రజలు స్వదేశంలో నిస్సహాయులుగా మిగిలిపోయారు’ అని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ బలోచిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోందని, దీంతో ప్రజలు ప్రతిఘటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బలోచిస్తాన్ గ్రామాలపై పాకిస్తాన్ ఆర్మీ ఫిరంగులు కురిపిస్తోందని, గ్రామాల ప్రజలను వేధిస్తోందని ఆయన తెలిపారు. అందువల్ల భారత్ జోక్యం చేసుకొని తమకు సహకరించాలని బ్రహందగ్ బుగ్తి కోరారు. తమ సంస్థ (బలోచ్ రిపబ్లికన్ పార్టీ) నిస్సహాయ స్థితిలో ఉందని, బహిరంగంగా పనిచేయలేక పోతోందని ఆయన వివరించారు. తమ కార్యకర్తలు అనేక మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదని, బహిరంగంగా పనిచేస్తే ప్రతి ఏటా కొంతమంది కార్యకర్తలు అదృశ్యమవుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితిని అంతర్జాతీయ సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు నివేదించాలని తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఏ మీడియాను కాని, స్వచ్ఛంద సంస్థను కాని బలోచిస్తాన్‌లోకి అనుమతించడం లేదన్నారు.