అంతర్జాతీయం

ఇటలీలో మళ్లీ భూ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమత్రైస్ (ఇటలీ), ఆగస్టు 26: పెను భూకంపంతో విధ్వంసానికి గురైన ఇటలీని శుక్రవారం మరోసారి బలమైన ప్రకంపనలు కుదిపేశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్న అమత్రైస్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు మరో బలమైన తదనంతర ప్రకంపన సంభవించడంతో ఇప్పటికే దెబ్బతిన్న కొన్ని భవనాలు మరింతగా బీటలు వారాయి. రిక్టర్ స్కేలుపై ఈ ప్రకంపన తీవ్రత 4.7 గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వీసు వెల్లడించగా, 4.8 తీవ్రతతో ఈ ప్రకంపన సంభవించిందని ఇటలీ భూభౌతిక పరిశోధనా సంస్థ పేర్కొంది. ఈ ప్రకంపనకు ముందు గురువారం రాత్రి నుంచి డజనుకు పైగా బలహీనమైన ప్రకంపనలు, ఆ తర్వాత గంట వ్యవధిలో మరో తొమ్మిది ప్రకంపనలు సంభవించాయని, బుధవారం ప్రధాన భూకంపం సంభవించినప్పటి నుంచి మొత్తం మీద ఈ ప్రాంతంలో దాదాపు వెయ్యి వరకు తదనంతర ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, శుక్రవారం ఉదయానికి దేశంలో భూకంప మృతుల సంఖ్య 267కు పెరిగిందని ఇటలీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు భూకంప బాధితులను రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే భూకంప శిథిలాల కింద నుంచి గత 36 గంటల్లో ఎవరూ సజీవంగా బయటపడలేదు. దీంతో శిథిలాల కింద ఇంకెవరూ ప్రాణాలతో ఉండకపోవచ్చని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం తీవ్ర భూకంపానికి ధ్వంసమైన సలేటా అనే ఇటలీ గ్రామాన్ని శుక్రవారం కూడా ప్రకంపనలు బెంబేలెత్తించాయి..
సెంట్రల్ ఇటలీలోని ఈ గ్రామం విహంగ దృశ్యమిది!