జాతీయ వార్తలు

అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకెళ్తున్న హిల్లరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 26: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమో క్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో హిల్లరీకి ఓటు వేయాలని భావిస్తున్నట్లు తా జాగా నిర్వహించిన సర్వేలో సగం మందికి పైగా ప్రజలు స్పష్టం చేశారు. అమెరికాలో 50 శాతం మందికి పైగా ప్రజలు హిల్లరీకి మద్దతు పలుకుతున్నట్లు తేలడం ఇదే తొలిసారి. క్విన్నిపియాక్ యూనివర్శిటీ శుక్రవారం ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 51 శాతం మంది ప్రజలు హిల్లరీకి మద్దతు తెలుపుతుండగా, ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 41 శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైందని, ట్రంప్ కంటే హిల్లరీ ఇప్పటికే 10 శాతం అధిక మద్దతును కూడగట్టుకున్నట్లు తమ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని క్విన్నిపియాక్ యూనివర్శిటీ సర్వే డైరెక్టర్ టిమ్ మల్లోయ్ తెలిపారు. దేశంలో ట్రంప్‌కు మద్దతు తెలిపేవారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆయన చెప్పారు.