అంతర్జాతీయం

బాబోయ్ ప్లానెట్-9!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 31: అసంఖ్యాక నక్షత్రాలు, గ్రహాలతో కూడిన మన సౌర వ్యవస్థకు ప్లానెట్-9 ముప్పు తేబోతోందా? తాజాగా జరిగిన ఓ ఖగోళ అధ్యయనాన్ని బట్టి ఈ తొమ్మిదో గ్రహం వల్ల మొత్తం సౌర వ్యవస్థకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని స్పష్టమవుతోంది. ప్లానెట్-9 అనే గ్రహం ఉందో లేదో స్పష్టంగా తెలియకపోయినా దీని ఉనికిని మాత్రం శాస్తవ్రేత్తలు గుర్తిస్తూనే వస్తున్నారు. మన సౌర వ్యవస్థ ఆవల ఈ తొమ్మిదో గ్రహం ఉండే అవకాశం ఉందని మాత్రం ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. ఈ అజ్ఞాత అదృశ్య గ్రహం వల్ల మన సౌరవ్యవస్థకు కచ్చితంగా ముప్పు వాటిల్లుతుందని, అదికూడా సూర్యుడు అంతరించిన తర్వాత ఓ మహా గ్రహం సమసిపోవడానికి ఇది దారితీయవచ్చునని చెబుతున్నారు. నేటికి ఏడు బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడులో క్షీణత మొదలవుతుంది. క్రమానుగతంగా అంతరించిపోతాడు. దీని ఫలితంగా సగానికి పైగా సూర్యుడులో ఉన్న అంతర్గత ద్రవ్యరాశి పేలిపోతుంది. దాని ఫలితంగా భూమిసహా ప్రతిదీ అంతరించిపోతుంది. ఈ పరిణామం అనంతరం సూర్యుడు ఓ అతిసూక్ష్మ శే్వతనక్షత్రంగానే మిగిలిపోతాడు. దీని ప్రభావం వల్ల బుధ గ్రహం, శని గ్రహం, యురేనియస్, నెప్ట్యూన్‌లు గతి తప్పుతాయని యుకెలోని వార్విక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు దిమిట్రి వేరాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ నాలుగు గ్రహాలు భూమికి ఎలాంటి ముప్పు వాటిల్లనంత దూరంలో ఉన్నాయి. అయితే సూర్యుడులో జరిగే అంతర్గత విస్ఫోటనం వల్ల మిగతా గ్రహాలకు ముప్పు వాటిల్లినా ప్లానెట్-9 మాత్రం స్థిరంగా ఉంటుందని, అనంతర పరిణామాల్లో మన సౌరవ్యవస్థను ధ్వంసం చేసే స్థాయిలో ఇది కరాళ నృత్యమే చేయవచ్చునని వెల్లడించారు. ముఖ్యంగా యురేనియస్, నెప్ట్యూన్‌లకు దీనివల్ల విఘాతకర పరిణామాలు ఎదురుకావచ్చునని తెలిపారు. దీని ప్రభావం వల్ల మన సౌరవ్యవస్థ నుంచే విసిరివేయబడే అవకాశం ఉంటుంది. గ్రహ వ్యవస్థ అంతం ఎలా ఉంటుందన్న దానిపై కంప్యూటర్ నమూనాలను శాస్తవ్రేత్త వేరాస్ రూపొందించారు. ప్లానెట్-9 వల్ల మన సౌరవ్యవస్థకు ఏ రకమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఏయే గ్రహాలకు స్థాన చలనం కలిగే అవకాశం ఉందన్న దాన్ని ఊహాజనితంగా సృష్టించారు. సూర్యుడు అంతరించిన తర్వాత గ్రహ వ్యవస్థలు ఆవిర్భవించే అవకాశం ఉందన్న సంకేతాలను ఆయన అందించారు. మొత్తంమీద ప్లానెట్-9 వల్ల మన సౌర వ్యవస్థకు తీవ్రస్థాయిలో ముప్పు అనివార్యమని, వౌలికంగానే దీని స్వరూపానే్న మార్చే అవకాశముంటుందని స్పష్టం చేశారు. అంటే సూర్యుడు అంతరించిన తర్వాత యురేనియస్, నెప్ట్యూన్ గ్రహాలకే ముప్పు అధికంగా ఉంటుందనేది ఈ పరిశోధన సారాంశం. ఈ పరిణామాల తర్వాత ప్లానెట్-9 కొనసాగితే దాని పరిభ్రమణ తీవ్రత ఎలా ఉంటుందనే దానిపైనే సౌరవ్యవస్థ భద్రత ఆధారపడి వుంటుందని స్పష్టం చేశారు.