అంతర్జాతీయం

అంగుళం కరగని అంటార్కటిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 16: గత 14 మిలియన్ సంవత్సరాలుగా తూర్పు అంటార్కటిక్ మంచు పర్వత పొర ఘనీభవించిన స్థితిలోనే ఉందని వినూత్న టెక్నిక్‌తో జరిపిన అధ్యయనంలో శాస్తవ్రేత్తలు నిర్థారించారు. ఈ ప్రాంతం అంటార్కటికాలోని అత్యంత ప్రాచీన మంచు నిక్షేపాల కోవలోకి వస్తుందని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అపారమైన వృక్ష సంపద ఉండేదని లెక్కలేనంతగా సెలయేళ్లు వుండేవని ఈ అధ్యయన సారాంశంగా వెల్లడించారు.
అయితే ఈ హిమఖండం ఎంతకాలం పాటు ఈవిధంగా కొనసాగిందీ, అలాగే అతి శీతల పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉండేవన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ ప్రాంత ప్రాచీన వాతావరణం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అలాగే భూతలంలో కార్బన్‌డయాక్సైడ్ పరిమాణం పెరిగిపోతున్న నేపథ్యంలో దాని ప్రభావం అంటార్కికా హిమ ప్రాంతంపై ఏవిధంగా ఉండే అవకాశం ఉందో నిర్థారించవచ్చునని వెల్లడించారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ పరిశోధకుడు ఈ అధ్యయనం జరిపారు. అయితే, ఇఏఐఎస్‌గా పేర్కొనే తూర్పు అంటార్కికా హిమ ప్రాంతం మాత్రం గత 14 మిలియన్ సంవత్సరాలుగా ఏరకమైన వాతావరణ ప్రతికూల పరిస్థితులకు లోనుకాలేదని వెల్లడించారు. ప్లయోసీన్ యుగంగా పేర్కొనే 3-5 మిలియన్ సంవత్సరాల కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఏ రకమైన కరుగుదల కనిపించలేదని వెల్లడించారు. అప్పట్లో కూడా కార్బన్‌డయాక్సైడ్ చాలా తీవ్రంగా ఉన్నా దాని ప్రభావం మాత్రం ఇఏఐఎస్‌పై ఏమాత్రం పడలేదని వెల్లడించారు. మామూలు హిమ ప్రాంతాలకంటే కూడా ఇఏఐఎస్ 20 రెట్లు అత్యంత విస్తృతమైనది. ఉపరితల ఉష్ణోగ్రత ప్రభావానికి ఇది కరిగిపోతే మాత్రం దానిద్వారా ఉత్పన్నమయ్యే జల ప్రవాహం అనేక సముద్రాల ఉపరితలాలను అనంతంగా పెంచేస్తుందని, దీనివల్ల తీర ప్రాంత దేశాలెన్నో మునిగిపోయే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు.

ఉగ్రదాడుల బెదిరింపులతో స్కూళ్లు మూసివేత

వాషింగ్టన్, డిసెంబర్ 16: భారీఎత్తున హింసకు పాల్పడుతామంటూ ఇ-మెయిల్ బెదిరింపులు రావడంతో అమెరికా లాస్‌ఏంజెల్స్ నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను బుధవారం మూసివేసారు. అమెరికాలోని అతిపెద్ద విద్యా కేంద్రాల్లో ఒకటైన లాస్‌ఏంజెల్స్‌లో పాఠశాలలను మూసివేయడంతో దాదాపు 6.6 లక్షల మంది విద్యార్థులపై దాని ప్రభావం కనిపించింది. న్యూయార్క్‌లోని పాఠశాలలకు కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి కానీ, అక్కడి అధికారులు మాత్రం పాఠశాలలను మూసివేయరాదని నిర్ణయించారు. కాగా, ఈ సంఘటనపై అమెరికా గూఢచార సంస్థ ఎఫ్‌బిఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ సంఘటన గురించి బుధవారం ఉదయం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సైతం అధికారులు వివరించారు. కాగా, అమెరికాను, దాని ప్రజలను ఎవరు కూడా భయోత్పాతానికి గురిచేయడానికి అనుమతించకూడదన్న కృతనిశ్చయంతో ఒబామా ఉన్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేసారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలన ప్రభుత్వం తీసుకుంటున్నాయని కూడా ఆయన చెప్పారు.