అంతర్జాతీయం

జాకీ చాన్‌కు ఆస్కార్ కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, సెప్టెంబర్ 2: ప్రసిద్ధ అంతర్జాతీయ నటుడు జాకీచాన్‌కు సమున్నత ఆస్కారం పురస్కారం లభించింది. సినిమా రంగానికి భిన్న కోణాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా జాకీచాన్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించాలని ఆస్కార్ అకాడమీ సంకల్పించింది. నవంబర్ 12న ఈ గౌరవ పురస్కారాన్ని జాకీచాన్‌కు ప్రదానం చేస్తారు. తమతమ రంగాల్లో అసాధారణ ప్రజ్ఞాపాటవాలను కనబరిచిన అనె్న కోటెస్, లిన్ స్టాల్‌మాస్టర్, ఫెడ్రిక్ వైస్‌మాన్‌లతో పాటు జాకీచాన్ ఈ పురస్కారాన్ని అందుకుంటారు. ఇలాంటి కళాకారుల కోసమే ప్రత్యేకంగా ఈ అవార్డును నెలకొల్పామని అకాడమీ అధ్యక్షురాలు చెరిల్ బూనె తెలిపారు. వీరి అసాధారణ ప్రతిభను గుర్తించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.