అంతర్జాతీయం

బ్రిటీష్ పత్రికపై ట్రంప్ భార్య పరువునష్టం దావా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 2: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌తో పరిచయానికి ముందు 1990 దశకంలో తాను వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్)ఉన్నట్లుగా ఆరోపిస్తూ తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించినందుకు బ్రిటీష్ దినపత్రిక ‘ది డైలీ మెయిల్’, అమెరికాకు చెందిన ఒక బ్లాగ్‌పై ట్రంప్ భార్య, గతంలో మోడల్‌గా పని చేసిన మెలానియా ట్రంప్ 15 కోట్ల డాలర్లకు పరువు నష్టం దావా వేశారు.
మెలానియాపై ఈ ప్రతివాదులు అనేక స్టేట్‌మెంట్లు చేశాయని, అవన్నీ కూడా నూటికి నూరు శాతం అబద్దాలే కాకుండా ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసేవిగా ఉన్నాయని మెలానియా తరఫు న్యాయవాది చార్లెస్ హార్డర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పత్రికలు వాస్తవాలను నిర్ధారించుకోకుండా అనేక అబద్ధాలను అమెరికా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రసారం చేశాయని ఆయన పేర్కొన్నారు. మెలానియా గత వారం ఈ రెండు ప్రచురణ సంస్థలకు లాయరు నోటీసులు పంపించారు. ఆమె గురువారం మేరీలాండ్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మెలానియా కేసు వేసిన వెంటనే డైలీమెయిల్ పత్రిక ఆ కథనాన్ని ప్రచురించినందుకు విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. మేరీలాండ్‌కు చెందిన ‘టార్ప్లే డాట్‌కామ్’ అనే వెబ్ పత్రిక సైతం మెలానియాకు క్షమాపణ చెప్తూ ఒక ప్రకటన చేసింది. అయితే డైలీ మెయిల్ క్షమాపణ చెప్పినప్పటికీ తన క్లయింట్ కేసును ఉపసంహరించుకోబోరని సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హార్డర్ స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోపణలే చేసిన మరో రెండు ప్రచురణ సంస్థలు సైతం ఇంతకు ముందే మెలానియాకు క్షమాపణలు చెప్పాయి.