అంతర్జాతీయం

హలో..హనోయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయ్, సెప్టెంబర్ 2:దాదాపు పదిహేనేళ్ల తర్వాత వియత్నాంలో పర్యటించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ శుక్రవారం రాజధాని నగరమైన హనోయ్‌లోకి అడుగు పెట్టారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, ఉగ్రవాద నిరోధక చర్యలపై వియత్నాం అగ్ర నాయకత్వంతో విస్తృత చర్చలు జరుపుతారు.
వియత్నాం పర్యటన ముగించుకుని అనంతరం జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళతారు. వియత్నాం ప్రధాని న్యూయెన్ జువాన్ ఫుచ్‌తో శనివారం మోదీ చర్చలు జరుపుతారని, అనంతరం దేశాధ్యక్షుడు ట్రాన్ దాయ్ కువాంగ్‌ను కలుసుకుంటారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. వీరితో జరిపే చర్చల్లో రక్షణ, భద్రతతో పాటు శాస్త్ర, సాంకేతిక అంశాలకు కూడా ప్రస్తావనకు వస్తాయని వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. 20 శతాబ్ద అత్యున్నత నాయకుల్లో ఒకరైన హో చి నిన్స్‌కు మోదీ నివాళులర్పిస్తారు.
నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం
ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని ముఖ్యమైన ప్రాధామ్యాలపైన, సవాళ్లపైన భారత దేశం ప్రపంచ దేశాల నేతలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం చైనాలోని హాంగ్ ఝౌలో జరగనున్న జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఒక నిర్మాణాత్మక, ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వియత్నాం బయలు దేరడానికి ముందు మోదీ మాట్లాడారు. వియత్నాంతో ద్వైపాక్షిక సంబంధాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రాధామ్యాలు, అంశాలపై జి-20 సదస్సులో చర్చించే అవకాశం ఉందని తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు నిధులను అడ్డుకోవడం, పన్నుల ఎగవేతను అరికట్టడం, పన్నులకు సంబంధించిన సమాచార పరస్పర మార్పిడి, యాంటీబయోటిక్‌లాంటి ముఖ్యమైన ఔషధాలకు మార్కెట్‌లో అవకాశం కల్పించడం లాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.
మన దేశానికి చెందిన ఒఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్ గత మూడు దశాబ్దాలుగా వియత్నాంలో చమురు అనే్వషణ కార్యకలాపాలు జరుపుతోంది. చమురు రంగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఢిల్లీ నుంచి వియత్నాంకు వెళ్లేందుకు విమానం ఎక్కుతున్న ప్రధానామోదీ