అంతర్జాతీయం

ఉగ్రవాదంపై విస్తృత పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్జౌ (చైనా), సెప్టెంబర్ 4: ఉగ్రవాదంపై పోరాడేందుకు కలసికట్టుగా విస్తృత ప్రయత్నాలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన చైనాలోని హాంగ్జౌలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాధినేతల సమావేశంలో ప్రసంగిస్తూ, ఉగ్రవాదులకు ఊతమిచ్చి, వారిని ప్రేరేపిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఊతమిచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాయి. దక్షిణాసియాతో పాటు ప్రపంచంలోని ఎక్కడి ఉగ్రవాదులకైనా సరే నిధులు, ఆయుధాలు అందకుండా చూడాల్సిన అవసరం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదంపై పోరాడేందుకు బ్రిక్స్ దేశాలు తమ ప్రయత్నాలను విస్తృతం చేయడంతో పాటు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశాలను ఏకాకులను చేసేందుకు కలసికట్టుగా చర్యలు చేపట్టాలి’ అని మోదీ పునరుద్ఘాటించారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా ఉన్న దాయాది దేశం పాకిస్తాన్‌ను ఉద్ధేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బ్రిక్స్‌కు ఎంతో పలుకుబడి ఉందని, కనుక వర్థమాన దేశాలు తమ అభివృద్ధి లక్ష్యాలను అందుకునే విధంగా అంతర్జాతీయ అజెండాకు రూపమివ్వడం బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. అస్థిరతకు మూల కారణంగా ఉన్న ఉగ్రవాదం వివిధ మార్గాల ద్వారా మరింత విస్తరిస్తుండటం మన సమాజాలకు, దేశాలకు అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని, ముఖ్యంగా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుండటం ఈ ముప్పును మరింత పెంచుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం.. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న బ్రిక్స్ దేశాధినేతల సమావేశంలో
ఆదివారం ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ