అంతర్జాతీయం

కలకలం రేపిన ఉత్తర కొరియా అణుపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 9: అతిపెద్ద అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రకటించుకుంది. ఒక నూక్లియర్ వార్‌హెడ్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రభు త్వం ధ్రువీకరించింది. ఉత్తర కొ రియా తాజాగా మరో అణు పరీక్ష నిర్వహించినట్లు దక్షిణ కొరియా మీడియాలో కథనాలు రాగా ఉత్తర కొరియా ప్రభుత్వం వాటిని ధ్రువీకరించింది. దేశ ఉత్తర ప్రాంతంలోని అణ్వస్త్ర పరీక్ష స్థలంలో తాజాగా అభివృద్ధి చేసిన నూక్లియర్ వార్‌హెడ్‌ను తమ శాస్తవ్రేత్తలు విజయవంతంగా పరీక్షించారని ఉత్తర కొరియా ప్రనుత్వ టీవీ ప్రకటించింది. విజయవంతంగా పరీక్ష నిర్వహించినందుకు శాస్తజ్ఞ్రులకు తమ బృందం అభినందన సందేశాన్నికూడా పంపించినట్లు తెలిపింది. ఉత్తర కొరియా ఇప్పటివరకు జరిపిన అణ్వస్త్ర పరీక్షలన్నిటికన్నా ఇది చాలా పెద్దదది దక్షిణ కొరియా పేర్కొంది. పది కిలోటన్నుల శక్తితో సంభవించిన పేలుడుకు ఉత్తర కొరియాలోని పుంగీ-రి పరీక్షా కేంద్రం వద్ద 5.3 పాయింట్ల తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించినట్లు కూడా దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా ఇప్పటివరకు నాలుగు అణు పరీక్షలు నిర్వహించగా, గత జనవరిలో జరిపిన నాలుగోఅణు పరీక్షకన్నా ఇది రెండింతలు శక్తివంతమైందని, హిరోషిమాపై వేసిన బాంబుకన్నా కాస్త తక్కువ శక్తి కలిగిందని దక్షిణ కొరియా వాతావరణ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ఉత్తర కొరియా జరిపిన తాజా అణు పరీక్షపై అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఇలాంటి బుద్ధిలేని రెచ్చగొట్టే చర్యల ద్వారా కిమ్‌జోంగ్ ఉన్ ప్రభుత్వం ఆత్మ వినాశనాన్ని కొనితెచ్చుకుంటోందని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యున్-హై మండిపడ్డారు. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలను విధించేలా భద్రతా మండలిలో పట్టుబడతామని కూడా ఆమె అన్నారు. కాగా, ఉత్తర కొరియా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం హెచ్చరించారు.