అంతర్జాతీయం

అమెరికా అజేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: ‘అమెరికాను ఎవరూ ఓడించలేరు.. మనల్ని చీల్చే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు’9/11 పదిహేనో వార్షిక సభలో అధ్యక్షుడు ఒబామా ప్రజలకు పిలుపునిచ్చారు. అల్‌ఖైదా, ఐసిస్ పేరేదైనా ఎంతటి ఉగ్రవాద సంస్థ అయినా కూడా అమెరికా జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఉద్ఘాటించారు. వరల్డ్ ట్రేడ్ సెండర్, పెంటగాన్‌పై అల్‌ఖైదా జరిపిన దాడిలో మరణించిన వారి స్మృత్యర్థం ఆదివారం పెంటగాన్‌లో నిర్వహించిన సంస్మరణ సభలో ఒబామా మాట్లాడారు. అమెరికా వంటి శక్తి, యుక్తి కలిగిన బలమైన దేశాన్ని ఎప్పటికీ జయించలేమన్న నిజం ఉగ్రవాద శక్తులకు స్పష్టమైందన్నారు. ప్రత్యక్షంగా అమెరికాను ఏమీ చేయలేక పోవడం వల్ల ఈ శక్తులు పరోక్ష మార్గాల్లో రెచ్చిపోతున్నాయని, ప్రజల్లో భయాందోళనలు కలిగించే చర్యలకు ఒడిగడుతున్నాయన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో నిండిన అమెరికా ఈ రకమైన భయాన్ని కలిగించడం ద్వారా వైషమ్య వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, వైవిధ్యంలో ఏకీకృతభావాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు. అమెరికా వైవిధ్యం బలహీనత కాదని, అదే ఆ దేశ బలమని ఉద్ఘాటించారు. 9/11 ఉగ్రదాడితో తల్లడిల్లిన అమెరికా అదే సంఘటిత శక్తితో అనంతర పరిణామాలను ఎదుర్కొందని గుర్తు చేశారు. అమెరికా నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి నాటి ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులర్పించడమే వారిలో ఉన్న ఐక్యతా భావానికి నిదర్శనమన్నారు. ఎంతగా నివాళులర్పించినా..ఎంతగా తమ ఆత్మీయతానురాగాలను చాటుకున్నా..మృతులకు నిజమైన నివాళి అమెరికాను సమైక్యంగా శక్తివంతం చేయడమేనని ఒబామా తెలిపారు. ఈ సమున్నత దేశాన్ని ఏ శక్తీ విడదీయలేనంతగా దీన్ని అన్ని విధాలుగా శక్తివంతంగా మార్చాలన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఒబామా పరోక్షంగా ప్రస్తావించారు.
9/11 మృతులకు మోదీ నివాళి
న్యూఢిల్లీ: న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడి చేసి నేటితో పదిహేనేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ప్రధాని 9/11 దాడి మృతులకు నివాళులర్పించారు. ‘సెప్టెంబర్ 11 అంటే రెండు పరస్పరం భిన్నమైన దృశ్యాలు మనసులో మెదులుతాయి. అందులో ఒకటి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడి అయితే మరోటి 1893లో స్వామి వివేకానంద చికాగోలో చరిత్రాత్మక ప్రసంగం చేసి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సంఘటన’ అని మోదీ వేర్వేరు ట్వీట్‌లలో పేర్కొన్నారు. 2001 సంవత్సరం సెప్టెంబర్ 11న ఉగ్రవాదులు చికాగోలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు చెందిన ట్విన్ టవర్స్‌ను విమానంతో ఢీకొట్టి కూల్చేసిన విషయం తెలిసిందే.