అంతర్జాతీయం

నేటి నుంచి మళ్లీ హిల్లరీ ప్రచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 14: స్వల్ప అస్వస్థతకు గురైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ గురువారం నుంచి యథావిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. న్యుమోనియాతో బాధపడుతున్న హిల్లరీ కొద్దిరోజులుగా ప్రచారానికి దూరంగా ఉన్నారు. విశ్రాంతి తరువాత ఆమె కోలుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ఉండగా గొం తుకు సంబంధించిన సమస్య తలెత్తింది. గత శుక్రవారమే ఇది చోటుచేసుకోగా విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే న్యూయార్క్‌లో ఏర్పాటైన 9/11 వార్షికోత్సవ సభలో మాట్లాడిన 68 ఏళ్ల హిల్లరీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదటపడడంతో ప్రచారంలో పాల్గొననున్నారు. ఇలాఉండగా హిల్లరీ అస్వస్థత పాలవ్వడాన్నీ రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారాస్త్రంగా వాడుకున్నారు.