జాతీయ వార్తలు

రాష్టప్రతి భవన్‌లోనే నేపాల్ ప్రధాని బస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: భారతదేశంలో నాలుగు రోజుల పాటు అధికారికంగా పర్యటించేందుకు నేపాల్ ప్రధాని పుష్పకమాల్ దహల్ (ప్రచండ) గురువారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకే ప్రచండ, తన భార్య సీతా దహల్‌తో పాటు ఈ పర్యటన చేపడుతున్నారు. రాష్టప్రతి భవన్‌లో ప్రభుత్వ అతిథులుగా వీరు బస చేస్తారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమవుతారు. అనంతరం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని, పలువురు కేంద్ర మంత్రులను ఈ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కలుసుకుని ఇరు దేశాల సంబంధాలపై ప్రచండ చర్చలు జరుపుతారు. తన తాజా పర్యటనలో భారత్ - నేపాల్ మధ్య విభేదాలు తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనగలవన్న ఆశాభావాన్ని ప్రచండ వ్యక్తం చేశారు. గత ఏడాది నేపాల్‌ను అతలాకుతలం చేసిన భూకంపం అనంతరం చేపట్టిన పునర్మిర్మాణ కార్యక్రమాల్లో భారత్ మరింత చురుగ్గా పాల్గొనే అంశంపై ఆయన చర్చలు జరుపుతారు. పునర్నిర్మాణానికి మరింతగా సాయం చేయాలంటూ భారత నాయకత్వాన్ని ఆయన అభ్యర్థించే అవకాశముంది. శుక్రవారం సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, పీయుష్ గోయల్ తదితర కేంద్ర మంత్రులను ప్రచండ కలుసుకుంటారు. శనివారం హోంమంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశమవుతారు.
chitram....

గురువారం ఢిల్లీలోని విమానాశ్రయంలో నేపాల్ ప్రధాని ప్రచండకు
స్వాగతం పలుకుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్