అంతర్జాతీయం

పాక్ మసీదుపై ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, సెప్టెంబర్ 16: వాయువ్య పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో శుక్రవారం ఓ మసీదుపై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 23 మంది మృతి చెందారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా బుట్మానాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. ఆఫ్గన్ సరిహద్దు గిరిజన జిల్లా మహ్మండ్‌లో మసీదుపై ఆత్మాహుతి బాంబుదాడి జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ‘మసీదులో ప్రార్థనలు జరుగుతున్నాయి. మానవ బాంబు అల్లాహూ అక్బర్ అంటూ తనను తాను పేల్చుకుని విస్ఫోటనం సృష్టించాడు’అని ప్రత్యక్షసాక్షి నవీద్ అక్బర్ తెలిపారు. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో అందరూ ప్రార్ధనలో నిమగ్నమై ఉండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి చెందగా, 29 మంది గాయపడినట్టు పాక్ మీడియా పేర్కొంది. సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించాయి. మెరుగైన వైద్యం కోసం బజౌర్, ఛార్‌సద్దా, పెషావర్ ఆసుపత్రులకు తరలించారు. కాగా దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ తాలిబన్‌లు కోర్టులు, విద్యా సంస్థలు, మసీదులనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు దిగుతున్నారు. ఉగ్రవాదంపై పోరు ఆగదని ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించిన కొద్ది సేపటికే మసీదుపై దాడి జరగడం గమనార్హం. దేశంలో ఉగ్రవాదం, ఉగ్రవాద కార్యకలాపాలను తుద ముట్టించాలని ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్‌ను ప్రధాని ఆదేశించారు. ఉదయమే వీరిద్దరూ సమావేశమై ఉగ్రవాద చర్యలపై సమీక్షించారు. కాగా సరిహద్దు జిల్లాలో నిత్యం యుద్ధ వాతావరణం ఉంటుంది.