అంతర్జాతీయం

ఎట్టకేలకు పాక్‌లో హిందూ వివాహ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 27: మైనార్టీ హిందువుల వివాహాలను రిజిస్టర్ చేసుకునే వీలు కల్పిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ ఓ చారిత్రక జాతీయ చట్టాన్ని ఆమోదించింది. హిందువుల కనీస వివాహ వయస్సును 18ఏళ్లుగా నిర్ణయించింది. మిగతా మతాలకు చెందిన వారిలో పురుషులు వివాహం చేసుకోవడానికి కనీస వయస్సు 18కాగా మహిళలకు పదహారు సంవత్సరాలు. వివాహ వయసు విషయంలో కొత్త చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై 5వేల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. వివాహాలను రిజిస్టర్ చేసుకోవడం వల్ల హిందూ మహిళలకు మరింత రక్షణ లభిస్తుందని, ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో హక్కులూ లభిస్తాయని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జోహ్రా యూసఫ్ తెలిపారు. వివాహాల రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల భర్త పోయిన వితంతువులకు ఇప్పటివరకూ ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తమకు వివాహమైందని రుజువు చేసే ఆధారాలేవీ వీరి వద్ద లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. కొత్త చట్టం వల్ల.. భర్త పోయిన ఆర్నెల్ల తర్వాత వితంతువులకు చట్ట పరంగా పనర్వివాహం చేసుకునే అవకాశం ఉంటుందని జోహ్రా తెలిపారు. విడాకులు ఇచ్చే హక్కును కూడా ఈ చట్టం హిందువులకు కల్పిస్తోందని ముఖ్యంగా.. భర్త నిర్లక్ష్యం చేయడం, రెండో పెళ్లి చేసుకోవడం లేదా పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందే తనకు వివాహం జరిగిందన్న కారణాలపై హిందూ మహిళలు విడాకులు ఇచ్చేందుకు దీనివల్ల అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. అయితే కిడ్నాప్‌లు, బలవంతపు మతమార్పిడుల నిరోధానికి సంబంధించి హిందువులకు మరింతగా రక్షణ కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు పది నెలల చర్చోపచర్చల తర్వాత ఈ బిల్లును పాక్ జాతీయ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది.