అంతర్జాతీయం

అంత సులువు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 27: సింధూజలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే ఐక్యరాజ్యసమితిని ఆశ్రయిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకోవటం కానీ, తప్పుకోవటం కానీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని పాకిస్తాన్ సీనియర్ దౌత్యవేత్త, ఆ దేశ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం గురించి జాతీయ అసెంబ్లీలో ఆయన వివరించారు. భారత్ ఈ దిశగా ఎలాంటి చర్య తీసుకున్నా అది యుద్ధోన్మాద చర్యే అవుతుందని ఆయన అన్నారు. ‘‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా భారత్ రద్దు చేసుకుంటే అది పాకిస్తాన్‌కు, మన ఆర్థిక వ్యవస్థకు పెద్దదెబ్బ అవుతుంది. భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంటే అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించినట్లే. మనం ఐక్యరాజ్యసమితిలో, భద్రతామండలిలో భారత్‌ను ఎండగట్టడానికి మంచి కారణం లభించినట్లవుతుంది’’ అని అజీజ్ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించే ఈ చర్యను అంతర్జాతీయ సమాజం గమనించాలని ఆయన అన్నారు. భారత ప్రధాని మోదీ అధ్యక్షతన సింధూ జలాల ఒప్పందంపై సోమవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న నదులను వీలైనంత ఎక్కువగా అదుపు చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
ఏకపక్ష నిర్ణయం కుదరదు
తాజా పరిణామాలపై అంతర్జాతీయ చట్టాల పరిశోధన సంస్థ అధ్యక్షుడు, మాజీ ఫెడరల్ న్యాయశాఖ మంత్రి అహ్మర్ బిలాల్ స్పందిస్తూ సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకోవటం ఆర్టికల్12(4) ప్రకారం సాధ్యం కాదని, భారత్, పాక్ రెండూ లిఖితపూర్వకంగా రాసుకుంటే తప్ప ఒప్పందం రద్దు కాదని స్పష్టం చేశారు. ‘ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, పాక్‌పై నమ్మకం కోల్పోయిందని భారత్ తనంత తానుగా చెప్పటి సాధ్యం కాదు. సింధూ జలాల ఒప్పందంలో నిర్దిష్ట కాలపరిమితి కానీ, సస్పెన్షన్ వంటి అంశాలు లేనందున ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరే అధికారం పాకిస్తాన్‌కు ఉంటుంది’ అని ఆయన అన్నారు.