అంతర్జాతీయం

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని పెరెస్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెల్‌అవీవ్, సెప్టెంబర్ 28: పాలస్తీనాతో దశాబ్దాలుగా సాగిన సంఘర్షణలకు స్వస్తిపలికి ఇరుదేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు విశ్వప్రయత్నం చేసిన ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత షిమన్ పెరెస్ (93) బుధవారం కన్నుమూశారు. మంగళవారం ఆయన శారీరక అవయవాలన్నీ విఫలమయ్యాయని, అంతకుముందు వచ్చిన జబ్బువల్ల మెదడుకూడా చికిత్స చేయలేనంతగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. పెరెస్ నిద్రలోనే కన్నుమూశారని వారన్నారు. పెరెస్ రెండు పర్యాయాలు ఇజ్రాయెల్ ప్రధానిగా, తొమ్మిదో అధ్యక్షుడుగా పనిచేశారు. మొదటినుంచీ కూడా భారతదేశం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చిన పెరెస్ భూమిమీదే అత్యంత ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించేవారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని గట్టిగా పట్టుబట్టారు. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు పెరెస్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.