అంతర్జాతీయం

ఏదో ఒక రోజు దేవుడికి సమాధానం చెప్పుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ, సెప్టెంబర్ 28: అలెప్పోలో బాంబు దాడులకు పాల్పడిన వ్యక్తులు ఏదో ఒక రోజు దేవునికి సమాధానం చెప్పుకోవల్సి ఉంటుందని పోప్ ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు. హింసకు పాల్పడడం, ప్రోత్సహించడం రెండూ తీవ్రమైన తప్పిదాలేనని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ మాట్లాడుతూ ‘బాంబుదాడికి ఎవరైతే బాధ్యులో వారు దేవుడికి సమాధానం చెప్పుకోల్సి ఉంటుంది’ అని అన్నారు. సిరియా, రష్యా దేశాల పేరు ఎక్కడా ప్రస్తావించని ఫ్రాన్సిస్ అలెప్పో దాడిపై స్పందించారు. బాంబు దాడి తనను ఎంతో బాధకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని సిరియా, రష్యా దళాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ‘బాంబు దాడివల్ల అలెప్పో నగరం చిన్నాభిన్నమైంది. ప్రజలందరూ నష్టపోయారు. ఎందరో చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అలెప్పోపై జరిగిన బాంబుదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. రష్యా ఆటవిక దాడుకలు ఇవి పరాకాష్టని యుఎస్ విమర్శించింది. ఈ సంఘటనను యుద్ధ నేరాల కింద పరిగణించాలని ఫ్రాన్స్ డిమాండ్ చేసింది. సిరియా, రష్యా వైమానిక దాడుల్లో 140 మంది మృతి చెందారు. బాధితులందరూ పౌరులేనని అధికారులు తెలిపారు. అలెప్పో నగరంలో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మందులు, ఆహారం దొరకడం లేదు.