అంతర్జాతీయం

అణ్వస్త్ర ఆత్మాహుతి బాంబర్లు పుట్టొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 30: పాకిస్తాన్‌లోని జిహాదిస్టులకు అణ్వాయుధాలు చేజిక్కించుకుంటే అణ్వాయుధ ఆత్మాహుతి బాంబర్లుగా మారే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్‌లో ఓ కుట్ర జరుగబోతోందనే భయంలో మనం జీవిస్తున్నాం. అదేంటంటే జిహాదిస్టులు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోబోతున్నారు. దాంతో వారికి అణ్వాయుధాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల అణ్వాయుధ ఆత్మాహుతి బాంబర్లు పుట్టుకొస్తారు. ఇది మరింత ముప్పు కలిగించే అంశం’ అని హిల్లరీ క్లింటన్ ఒక ఆడియోలో పేర్కొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. డెమొక్రటిక్ పార్టీ కంప్యూటర్లలో ఉన్న ఈ ఆడియో హ్యాకింగ్‌కు గురయిందని వెల్లడించింది. ‘్భరత్‌తో ఘర్షణాత్మక పరిస్థితులు కొనసాగుతుండటం వల్ల పాకిస్తాన్ వ్యూహాత్మక అణ్వాయుధాల అభివృద్ధి దిశగా వేగంగా పరుగెత్తుతోంది’ అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కూడా అయిన హిల్లరీ క్లింటన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విరాళాల సేకరణ కోసం వర్జీనియాలో ఏర్పాటు చేసిన ఒక అంతర్గత సమావేశంలో చెప్పినట్టు ఆ పత్రిక తెలిపింది. 50 నిమిషాల నిడివి గల ఈ ఆడియో ‘ద వాషింగ్టన్ ఫ్రీ బీకన్’ అనే వెబ్‌సైట్‌లో కనపడిందని వెల్లడించింది.
విరాళాల సేకరణకోసం నిర్వహించిన అంతర్గత సమావేశంలో అణ్వాయుధాల ఆధునీకరణపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ హిల్లరీ క్లింటన్ ఈ విషయం చెప్పినట్టు ఆ పత్రిక వెల్లడించింది. అణ్వస్త్రాల రేస్ మొదలయిందని, రష్యా, చైనాలతో పాటు పాకిస్తాన్, భారత్‌లు ఈ రేసులో ఉన్నాయని హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా హెచ్చరించినట్టు ఆ పత్రిక వివరించింది. అత్యంత ప్రమాదకరమైన పరిణామాలలో ఇది ఒకటని ఆమె అన్నట్టు ఆ పత్రిక తెలిపింది.