జాతీయ వార్తలు

సార్క్‌ను వాయదా వేసుకున్న పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 30: భారత్ సహా మొత్తం నాలుగు దేశాలు బాయ్‌కాట్ చేయడంతో నవంబర్‌లో జరగాల్సిన 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సును పాకిస్తాన్ వాయిదా వేసుకుంది. ఈ సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించడం ద్వారా మొత్తం సార్క్ ప్రక్రియనే భారత్ గాడి తప్పించిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమ మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్యల కారణంగా ఈ బహుళ దేశ వేదికను నీరుగార్చడం సార్క్ నియమావళినే ఉల్లంఘించడమేనని పాక్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సు ఏర్పాటుకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని, చివరి క్షణంలో భారత్ మొత్తం నీరుగార్చిందని తెలిపింది. ప్రస్తుత సదస్సు తేదీని వాయిదా వేసుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరలోనే దీన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది. త్వరలోనే ప్రస్తుత చైర్మన్ నేపాల్ ద్వారా ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది.