అంతర్జాతీయం

శాంతి... శాంతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, సెప్టెంబర్ 30: జమ్మూకాశ్మీర్‌లోని ఎల్‌ఓసి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఐరాస స్పందించింది. ఉద్రిక్తతలు సడలించుకునేందుకు భారత్, పాకిస్తాన్‌లు ప్రయత్నించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ సూచించారు. శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించిన ఆయన దాని కోసం ఇరు దేశాలు దృష్టి సారించాలన్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత్ నిర్వహించిన సర్జికల్ దాడి, అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తాము గమనిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఐరాస మిలటరీ అబ్జర్వర్ గ్రూపు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందని బాన్‌కీమూన్ అధికార ప్రతినిధి స్టిఫెనే డుజార్రిక్ వెల్లడించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు సడలించేదిశగా ఇరుదేశాలు కృషి చేయాలని ఐరాస విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని మూన్ అన్నారు. ఈమేరకు ఇరుదేశాల అధినేతలతో ఐరాస ప్రధాన కార్యదర్శి మాట్లాడారని కూడా డుజార్రిక్ తెలిపారు. నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సు గురించి అడగ్గా ‘సదస్సు రద్దయినట్టు మాకు ఎలాంటి సమాచారం లేదు’ అని బదులిచ్చారు. పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు నిరసనగా సార్క్ సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. భారత్ తన నిర్ణయాన్ని వెల్లడించిన అనంతరం ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లు కూడా సార్క్ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించాయి. పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాశ్మీర్ అంశం ఇరుదేశాల మధ్య దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉంది.